CM KCR: కేసీఆర్ తప్పు మీద తప్పు చేస్తున్నాడా..?

CM KCR తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి ఎవరికీ ఒక పట్టాన అర్ధం కానీ విషయం. అదే సమయంలో కేసీఆర్ కు ఏమైనా సలహాలు చెప్పే స్థాయి కూడా సొంత పార్టీలో ఎవరికీ లేదు.. ఎవరైనా చెప్పిన వినే నైజం కూడా ఆయనది కాదు.. అయితే ఎల్లప్పుడూ ఆ ధోరణి పనిచేయకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో పేట్రేగిపోతోంది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు కనిపించటం లేదు. కనీసం కరోనాపై సమీక్షలు కూడా చేసిన దాఖలాలు కనిపించటం లేదు.. మొదటి వేవ్ లో చూపించిన శ్రద్ద రెండో వేవ్ చూపించటం లేదు కేసీఆర్..

CM KCR announces FREE COVID19 Vaccine to all the eligible people in telangana

దీని వలన కరోనా విలయతాండవం చేస్తుంది. దీనికి తోడు ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుండి భారీ ఎత్తున దోచుకుంటున్న కానీ కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పక్క రాష్ట్రంలో ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రుల మీద దాడులు చేసి వాటిని సక్రమమైన మార్గంలో పెట్టె ప్రయత్నాలు చేస్తున్న కానీ కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచించటం లేదు. దీనికి తోడు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న కానీ కనీసం దానిపై కూడా నిర్ణయం తీసుకోలేదు సీఎం.

దీని బట్టి చూస్తుంటే కరోనా రోగులను కేసీఆర్ సర్కార్ గాలికి వదిలేసినట్లు ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇది మాటలు ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ కు చెడ్డ పేరు తీసుకోని వచ్చేవి. కనీసం ఇప్పటికైనా మేల్కొని కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు సహాయం చేస్తే మంచిది. అదే విధంగా కొన్ని హోటల్స్ మరియు హాస్టల్స్ ను తీసుకోని కరోనా రోగులకు సరైన వైద్యం అందించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడుతుంది. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత కదా అంటూ ప్రశించింది.. మీరు భూమి మీద ఉన్నారా..? ఆకాశంలో ఉన్నారా అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించింది కోర్టు. కాబట్టి సీఎం సర్ ఇప్పటికైనా కరోనా రోగుల విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో ఇబ్బందులు తప్పవు

Advertisement