India TV CNX Conducted Survey In Telangana : ఇండియా టీవీ సర్వే.. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని..?
NQ Staff - July 29, 2023 / 10:18 AM IST

India TV CNX Conducted Survey In Telangana :
రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో ఇప్పటి నుంచే అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి పార్టీలు. ఇక ఏ పార్టీ అయినా సరే రాబోయే ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. మధ్యలో కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
తాజాగా ఇండియా టీవీ సీఎన్ ఎక్స్ కూడా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సర్వేలో తెలిపింది. ఈసారి కూడా బీఎర్ ఎస్ కు తిరుగు ఉండదని తేల్చింది. కాకపోతే గతంలో కంటే మెరుగ్గా సీట్లు రావని తేల్చింది. బీఆర్ ఎస్ కు 9 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది ఈ సర్వే.
కాంగ్రెస్ కు తగ్గనున్నాయా..?
ఇక బీజేపీకి అనూహ్యంగా 5 నుంచి 6 ఎంపీ సీట్లు వస్తాయంట. గతంలో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ ఈ సారి 2 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటుందని చెప్పింది ఈ సర్వే. ఇక కాంగ్రెస్ కు ఈ సారి 2 సీట్లు వస్తాయని చెప్పింది. అటు ఎంఐఎం కు ఎప్పటిలాగానే 1 సీటు గెలుచుకుంటుందని చెప్పింది ఈసర్వే.
ఈ సర్వేలో బీఆర్ ఎస్ సీట్లు యథాతథంగా ఉంటున్నాయి. కానీ కాంగ్రెస్ సీట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఈ సర్వే. కాంగ్రెస్ సీట్లు బీజేపీకి మళ్లే అవకాశం ఉందంట. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశం అనే చెప్పుకోవాలి. కానీ బీఆర్ ఎస్ కు సీట్లు పెరగకపోవడం కేంద్ర రాజకీయాల్లో ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశమే.