ఇంత జరిగిన కాంగ్రెస్ కు బుద్ది రాలేదు.. ఇక నాశనమే తరువాయి

PBN - December 6, 2020 / 01:01 PM IST

ఇంత జరిగిన కాంగ్రెస్ కు బుద్ది రాలేదు.. ఇక నాశనమే తరువాయి

గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి ఎదుర్కొంది. గతంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా హవా కొనసాగించిన కాంగ్రెస్ నేడు ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేసే దారుణమైన స్థితికి చేరుకుంది, అందుకు కారణం ఎవరయ్యా అంటే తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే అని చెప్పాలి.

congress party

కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. డిపాజిట్లు రాని పార్టీగా మార్చేశారు. ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టని.. కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మలు దగ్దం చేసుకునేంత వరకూ పరిస్థితి వచ్చింది. గ్రేటర్‌లోనూ పార్టీ పరిస్థితి అయిపోయిందనిపించిన తర్వాత ఆయన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు.

పీసీసీ పదవీ రేస్ లో మొదటి నుండి రేవంత్ రెడ్డి ముందున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేత కావాలని కోరుకుంటున్నారు, ఈ క్రమంలో ఆయనే తదుపరి పీసీసీ చీఫ్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కాంగ్రెస్ లో రచ్చ మొదలైంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాము రేసులో ఉన్నామంటున్నారు. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి పీసీసీ కోసం రాజకీయం చేస్తోంది. భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల, వి.హెచ్ వంటి వారంతా పార్టీలో మొదటి నుండి పనిచేస్తోన్న వారికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని హై కమాండ్ ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి, బలరాం నాయక్ వంటి నేతలు రేవంత్ పీసీసీ కావాలని బలంగా కోరుకుంటున్నారు.

ఢిల్లీ స్థాయి కాంగ్రెస్ వర్గాలు సైతం రేవంత్ రెడ్డి లాంటి నేతకే పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది, కానీ ఇక్కడ సీనియర్ నేతలు మాత్రం పట్టు వదలటం లేదు. రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇస్తే పార్టీ నుండి వెళ్లిపోవటానికి సిద్ధం అనే సంకేతాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న దీనావస్థలో కూడా ఇలాంటి గొడవలు పడుతూ మీడియా ఎక్కుతున్న నాయకులను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇలాంటి అంతర్గత గొడవలు వలన పార్టీకి దారుణంగా దెబ్బతింది. అయినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ది రాకపోవటం చూస్తుంటే కాంగ్రెస్ నాశనం అయ్యేదాకా వీళ్ళు పంతాలు వీడేలా కనిపించటం లేదు

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us