ఈటెల ఇలా చేస్తే… కేసీఆర్ జమానా కూలటం ఖాయం

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది. అధికార పార్టీ తెరాస లో పెద్ద ఎత్తున రాజకీయ క్రీడకు తెరలేచింది. మంత్రి ఈటెల రాజేందర్ పై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. బహుశా కేసీఆర్ కూడా ఇది ఊహించి ఉండకపోవచ్చు. తన అనుకూల మీడియా ద్వారా మంత్రి ఈటెల మీద ముప్పేట దాడి చేస్తూ సంచలన వార్తలు ప్రసారం చేసిన కానీ అవేమి జనాలు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీనితో ఈటెలకు కూడా ప్రజా బలం భారీ స్థాయిలోనే ఉన్నట్లు అర్ధం అవుతుంది.

is etela rajender interested to join in bjp

ఇప్పుడు అదే అదునుగా ఈటెల ఒక కీలకమైన నిర్ణయం కనుక తీసుకుంటే అది తెరాస పార్టీకి పెద్ద షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఈటెల మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లగలిగితే మాత్రం రాజకీయంగా అది పెద్ద ఎత్తుగడ అవుతుందని తెలుస్తుంది.

ఎలాగూ మంత్రి పదవి లేదు.. వచ్చే అవకాశం కూడా లేదు. పైగా ఈటెల మీద రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వ్యక్తం అవుతుంది. మిగిలిన పార్టీలు కూడా ఈటెల రాజేందర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాను ప్రతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే మిగిలిన పార్టీలు కూడా ఈ సమయంలో ఈటెలకు అనుకూలంగా నిలబడే అవకాశం లేకపోలేదు.

పైగా 2009 నుండి ఇప్పటివరకు హుజురాబాద్ లో ఓటమి అనేది లేకుండా ప్రతి సరి ఎన్నికల్లో తన మెజారిటీ పెంచుకుంటూ ఘన విజయాలు సాధిస్తున్నాడు ఈటెల. 2018 ఎన్నికల్లో లక్ష పైచిలుకు ఓట్లు మెజారిటీతో గెలిచి మంత్రి అయ్యాడు. సానుభూతి ఉంది, మిగిలిన పార్టీల మద్దతు కూడా కూడగడితే కాబట్టి ఎన్నికల్లో గెలుపు అనేది పెద్ద కష్టం కాదు. అనుకున్నట్లే ఈటెల రాజీనామా చేసి ఉపపోరుకు వెళితే అది తెరాస కు శరాఘాతమే అవుతుంది. ఈటెల లాంటి బలమైన నేతను తట్టుకొని తెరాస నిలబడటం కష్టం. అదే జరిగితే దాని ప్రభావం 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల మీద పడుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలని చూస్తున్న తరుణంలో ఈటెల తో కయ్యం కేసీఆర్ కు ఇబ్బందిని తెచ్చిపెట్టే విధంగా ఉందని విశ్లేషకులు అంటున్న మాట

Advertisement