Chandra Babu: చంద్రబాబును ఇరికిస్తే నన్ను వదిలేస్తారు : దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

Chandra Babu తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మార్ఫింగ్ చేసి విడుదల చేశారు అనే అనుమానంతో ఉమ మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సీఐడీ ఆఫీసులో దేవినేని ఉమ విచారణ ముగిసింది. 9 గంటల పాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

devineniumah

విచారణ ముగిసిన అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.చంద్రబాబు నాతో సెల్‌లో వీడియో ప్లే చేయించారని చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. జగన్ తప్పుడు కేసులు పెట్టి మా గొంతు నొక్కాలని చూస్తున్నారు.
చంద్రబాబు పేరు చెబితే నన్ను వదిలేస్తానని చెప్పారు. జగన్ అక్రమ కేసులకు నేను భయపడను. చట్టాన్ని జగన్ చుట్టం చేసుకున్నాడు. జగన్‌కు కేబినెట్‌ పెట్టే దమ్ము లేదు..పిల్లలకు పరీక్షలు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. చేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఉమా..

అయితే ఉమ మాటలు కొన్ని నమ్మశ్యకంగా లేనట్లు అనిపిస్తున్నాయి. ఉమ లాంటి కీలమైన నేతను పట్టుకొని చంద్రబాబు పేరు చెప్పు నిన్ను వదిలిపెడుతామని ఏ అధికారైనా అనగలడా ..? ఊరు పేరు లేని కార్యకర్తను పట్టుకొని ఇలా చెప్పమని చెప్పారంటే నమ్మవచ్చు కానీ,
మాజీ మంత్రి, ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగిన దేవినేని ఉమను పట్టుకొని ఇలా బాబు పేరు చెపితే నిన్ను వదిలేస్తామని ఆశ పెట్టారు అనేది నమ్మలేని విషయం.

ఇక ఈ కేసులో మరికొన్ని రోజులు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మే 1న మరోసారి విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమకు సీఐడీ అధికారులు సూచించారు. అదే రోజు ఉదయం 9 గంటలకు దేవినేని ఉమ పర్సనల్ ట్యాబ్‌ తీసుకురావాలని చెప్పారు. మరి చివరికి ఈ కేసు ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి

Advertisement