Jr. NTR: కుప్పంలో జూ.ఎన్టీఆర్ మాట… చంద్రబాబుకు తూటాతో సమానం
PBN - February 27, 2021 / 11:45 AM IST

Jr. NTR మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. అదే ఊపులో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ పెద్ద సంఖ్యలో విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా …చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎంతో బలంగా ఉందని ఇంత కాలం ప్రత్యర్థులు కూడా నమ్ముతూ వచ్చారు. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు , రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కంటే కుప్పంలో కూడా టీడీపీ పరిస్థితి భిన్నంగా లేదని నిరూపించాయి. దీంతో ఇప్పటికైనా మేల్కోకపోతే తనకే ఎసరు పెట్టేలా ఉన్నారని చంద్రబాబు భయాందోళనకు గురై ఆయన కుప్పానికి ఆగమేఘాలపై వెళ్లారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. శాంతిపురంలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబుకు కార్యకర్తల నుంచి ఆసక్తికర, ఆశ్చర్యకర డిమాండ్ ఎదురైంది. కుప్పానికి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తరపున తీసుకు రావాలని , అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ను తిప్పాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి రావడంతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ డిమాండ్ చంద్రబాబును కలవరానికి గురి చేస్తోంది.
తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను తీసుకోనిరావాలని బాబు చూస్తున్న కానీ రోజు రోజుకి లోకేష్ పరిస్థితి మరింత దారుణంగా తయారు అవుతుంది. చినబాబు లో అనుకున్న ఫైర్ లేదని టీడీపీ క్యాడర్ మొత్తం భావిస్తుంది. చంద్రబాబు సహా లోకేశ్ వల్ల పార్టీ మనుగడ సాధ్యం కాదని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమడు, చరిష్మా ఉన్న యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు అనే సంకేతాలు కార్యకర్తలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేశాడు . మధ్యలో ప్రమాదం జరగటంతో ప్రచారాన్ని ఆపేయటం జరిగింది. ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట్ల పార్టీ ఎన్నికల్లో గెలవకపోయిన కానీ కానీ ఆకట్టుకునే ఉపన్యాసకుడిగా, ప్రజాకర్షణ నేతగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఆ తర్వాత చంద్రబాబు రాజకీయాల వలన ఇబ్బంది పడిన ఎన్టీఆర్ పెద్దగా పార్టీ వైపు చూడకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీ కి తిరిగి పూర్వ వైభవం తీసుకోని రాగలిగిన నేతగా భావిస్తున్నారు. అందుకే కుప్పంలో చంద్రబాబు ఎదుటే ఎన్టీఆర్ ను తీసుకోనిరావాలని డిమాండ్ చేయటం జరిగింది. ఈ పరిణామం ఖచ్చితంగా బాబుకు ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి