MLA Balakrishna : నందమూరి బాలకృష్ణపై హిజ్రాల ఫిర్యాదు.! కారణం తెలిస్తే షాక్.!

NQ Staff - October 2, 2022 / 05:35 PM IST

MLA Balakrishna : నందమూరి బాలకృష్ణపై హిజ్రాల ఫిర్యాదు.! కారణం తెలిస్తే షాక్.!

MLA Balakrishna : సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హిజ్రాలు ఫిర్యాదు చేయడమేంటి.? అంతలా హిజ్రాల్ని నందమూరి బాలకృష్ణ ఏం ఇబ్బంది పెట్టారు.? వారికి బాలకృష్ణ ఎలాంటి కష్టం కలిగించారు.? బాలకృష్ణపై హిజ్రాలు ఫిర్యాదు చేయడంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది.

కానీ, అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. వరుసగా రెండోసారి ఆయన హిందూపురం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విషయం విదితమే.

నియోజకవర్గానికి అందుబాటులో వుండటం లేదంటూ..

నందమూరి బాలకృష్ణ పేరుకే టీడీపీ నేత, ఎమ్మెల్యే. కానీ, నియోజకవర్గ సమస్యలు పట్టించుకోరు. టీడీపీ నిర్వహించే రాజకీయ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించరు. సరే, టీడీపీలో బాలకృష్ణ కనిపించకపోవడమనేది పార్టీ వ్యవహారం. నియోజకవర్గ ప్రజలకైతే అందుబాటులో వుండాలి కదా.! ఎమ్మెల్యేగా అది ఆయన బాధ్యత.

తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ హిజ్రాలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. అద్గదీ అసలు సంగతి. అయితే, ఈ వ్యవహారంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు, హిందూపురం టీడీపీ కార్యకర్తలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ మార్కు ‘డర్టీ పాలిటిక్స్’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణిస్తున్నారు బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us