High Court Ruled Election Of MLA Vanama Venkateswara Rao Invalid : కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. హైకోర్టు సంచలన తీర్పు..!
NQ Staff - July 25, 2023 / 12:39 PM IST

High Court Ruled Election Of MLA Vanama Venkateswara Rao Invalid :
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొత్తగూడెం నుంచి ఆయన గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్ రావు ఓడిపోయారు.
అప్పట్లో కాంగ్రెస్ తరఫున..
ఇక గెలిచిన తర్వాత వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారు పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి జలగం వెంకట్ రావుకు ఆయనకు నడుమ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వనమా వెంకటేశ్వర్ రావు గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ను సమర్పించారని జలగం వెంకట్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.

High Court Ruled Election Of MLA Vanama Venkateswara Rao Invalid
ఇన్ని రోజులు కేసును విచారించిన కోర్టు నేడు సంచలన తీర్పు వెల్లడించింది. అఫిడవిట్ తప్పుగా ఉందని గుర్తించిన కోర్టు ఈ మేరకు ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. 2018 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది హైకోర్టు. దాంతో బీఆర్ ఎస్ లో కలకలం రేగుతోంది. మరి దీనిపై వనమా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు
కొత్తగూడెంలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన… pic.twitter.com/xUz9JwKcuc
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2023