High Court: ఎన్నికలంటే మీ ఆటలు కాదు..హై కోర్ట్ తీర్పు విని అంత షాక్

High Court ( హై కోర్ట్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను జనవరి 8వ తేదీన విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి నిమ్మగడ్డ షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని విరుద్దమని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఐతే జనవరి 11వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి వాదోపవాదనలను విని.. నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో నిమ్మగడ్డ రంగంలోకి దిగి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం రోజు విచారణ చేసిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసి ఈరోజున వెలువరించింది.

high court about ap local elections
high court about ap local elections

ఈ ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. నేడు ఉన్న న్యాయచట్టాల ప్రకారం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదని స్పష్టం చేస్తూ.. ఆ తీర్పును కొట్టివేసింది. అలాగే ఎన్నికల నిర్వహణ వాయిదా వేయకుండా నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య బాధ్యత అని హైకోర్టు గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె) ప్రకారం ఎన్నికల కమీషన్ సమర్థవంతంగా తమ విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం తప్పకుండా సహకరించాల్సినదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యంతో పాటు ఎన్నికలు నిర్వహించడం కూడా ముఖ్యమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగుతూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా.. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జనవరి 8వ తేదీన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నాలుగు విడతల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతుందని ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తుందో లేదో చూడాలి

Advertisement