గీతం కూల్చివేతకు ఆయనే కారణం.. వెలుగు చూసిన అసలు నిజాలు

PBN - October 26, 2020 / 06:00 AM IST

గీతం కూల్చివేతకు ఆయనే కారణం.. వెలుగు చూసిన అసలు నిజాలు

విశాఖపట్నం గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎక్కడ చుసిన గీతం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో గీతం గురించి తెలియని వాళ్ళు లేకపోవటం, అదే సమయంలో అది స్వయానా బాలకృష్ణ చిన్నల్లుడుకి చెందిన సంస్థ కావటంతో దానిపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది.

cm jagan

ఈ విషయంలో సీఎం జగన్ ను ఒక విలన్ గా టీడీపీ అనుకూల మీడియా చూపిస్తుంది. వైసీపీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు గీతం విషయంలో కక్ష సాధింపు ధోరణి అని చెపుతున్నారు తప్పితే, అవి అక్రమ కట్టడాలు కాదు అని మాత్రం అనటం లేదు.. 2014 లో టీడీపీ గెలిచిన చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయినా తర్వాత గీతం యూనివర్సిటీ కి సంబంధించిన 40 ఎకరాల భూమి ని క్రమబద్ధీకరణ చేయాలనీ అందుకు సంబంధించిన ఫైల్ ను దివంగత మూర్తి అనేకసార్లు పంపారట. అయితే దానిని పట్టించుకోకుండా బాబు పక్కనపెట్టడం వల్లనే రెవిన్యూ రికార్డుల్లో అది అక్రమ భూమిగా ఉండిపోయింది. అక్రమ భూములు కచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే కాబట్టి వైసీపీ సర్కార్ ఆ పని చేసింది.

కేవలం నామమాత్రపు ధరకే వందల ఎకరాలు గీతం సంస్థకు ఇచ్చిన టీడీపీ పెద్దలు, ఆ కాస్తా 40 ఎకరాల ఆక్రమణను కూడా క్రమబద్ధీకరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేస్తే అది కక్ష సాధింపు ధోరణి అంటూ నిందలు వేస్తున్నాడు బాబు. విశాఖలో మూర్తి టీడీపీ పార్టీకి ఎంతో గణనీయంగానే సేవ చేసిన నేత, విశాఖలో నాలుగు దిక్కులు టీడీపీ కనుసన్నల్లో వున్నాయంటే అందులో మూర్తి హస్తం లేకపోలేదు. అయితే ఆయన్ని కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు వాడుకున్నాడు అనే విమర్శలు కూడా వున్నాయి. దీనిపై ఏపీ మంత్రి, విశాఖ జిల్లాలో ముఖ్య నేత అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ , నిజానికి బాబుకు మూర్తి కుటుంబం మీద ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం లేవని, కేవలం రాజకీయం కోసం ఇపుడు ఈ విషయాన్ని వాడుకుంటున్నారని అన్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us