సామూహిక ఆత్మహత్యలకు గవర్నర్ అనుమతి ఇవ్వాలి: అమరావతి రైతులు
Admin - August 6, 2020 / 10:19 AM IST

ఏపీ రాజధానిని అమరావతి నుండి తొలగిస్తూ, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చి తమకు అన్యాయం చేయవద్దని, మొదట అమరావతిని రాజధానిగా చేయడానికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నార్తు. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
అయితే ఈరోజు హై కోర్టు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర హోమ్.. రాజధాని అంశంపై తాము జోక్యం చేసుకోలేమని, రాజధాని అంశం పూర్తిగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని వెల్లడించింది. దింతో అమరావతి రైతులు రాజధానిని మార్చడం వల్ల తాము నష్టపోతామని, దానికి బదులు తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇవ్వాలని ఉరి తాడులను బిగించుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.