Goshamahal BJP MLA Rajasingh : మహ్మద్ ప్రవక్తపై సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్యేల్యే అరెస్ట్
NQ Staff - August 23, 2022 / 05:03 PM IST

Goshamahal BJP MLA Rajasingh : గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తలలోకి ఎక్కారు.ఆయన తమ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఎంఐఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడే భైఠాయిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరో వివాదం..
ఈ క్రమంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ఇంటివద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటుచేసి ఆయనను అరెస్ట్ చేశారు. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే వీడియోపై వివాదం రేగుతుండటంతో యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది .

Goshamahal BJP MLA Rajasingh News with His Controversial Comments
రాజా సింగ్‌పై భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. డబీర్ పురా పోలీసు స్టేషన్లో ఐపీసీ 153-A, 295-A, 505(1)(b)(c), 505 (2) , 506 సెక్షన్ల కింద రాజాసింగ్‌పై కేసు నమోదైందని సమాచారం. కాగా, ఆగస్టు 20న ఫరూకీ కామెడీ షో నిర్వహించారు. ఈ షోకు ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో.. రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే రాజా సింగ్ సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మునావర్ ఫరూఖీ అనే కమెడియన్ తన ప్రదర్శనల్లో శ్రీరాముడు, సీతమ్మ తల్లి గురించి కామెడీ చేస్తున్నాడని రాజాసింగ్ ఫైరయ్యారు. మునావర్ డిస్టర్బ్ అయిన పిరికివాడని ఎద్దేవా చేశారు. మునావర్ థర్డ్ క్లాస్ కామెడీతో హిందువులను, బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన 53 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు అంటూ.. మహ్మద్ ప్రవక్తపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘శ్రీరామ్ ఛానెల్ తెలంగాణ’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో రాజా సింగ్ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో పట్ల ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.