KCR: కేసీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. వాళ్ల మొక్కులు, వాళ్లు చేసిన పూజలు ఫలించాయి. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతిత్వరలో తన రోజువారీ కార్యక్రమాలకు హాజవుతారు. సంతోషకరమైన ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎం.వి.రావు నిన్న గురువారమే మీడియాకి తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయనకి ఎలాంటి సమస్యలూ లేవని, కాకపోతే కాస్త విశ్రాంతి అవసరమని చెప్పారు. మొన్న బుధవారం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ లో ముఖ్యమంత్రికి ముఖ్యమైన ఆరోగ్య, రక్త పరీక్షలన్నీ చేసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టుల రిపోర్టులు నిన్న గురువారం వచ్చాయి. అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి. సీఎం కేసీఆర్ శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని అంతకుముందే వెల్లడైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది.

మొన్నే టెన్షన్ పోయింది..

ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న హాస్పిటల్ కి వస్తున్నారంటే అందరూ ఆందోళన చెందారు. హెల్త్ పరంగా ఏదైనా తీవ్ర ఇబ్బంది తలెత్తిందేమోనని కంగారు పడ్డారు. కానీ.. ఆ రోజు ఆయన అక్కడెక్కడో ఉన్న తన ఫాం హౌజ్ నుంచి కూడా కారులోనే ఓపిగ్గా కూర్చొని ఆసుపత్రికి రావటం, స్వయంగా నడుచుకుంటూ లోపలికి పోవటం, పరీక్షలన్నీ చేయించుకొని బయటకు వెళ్లటం తదితర దృశ్యాలను టీవీల్లో, పేపర్లలో చూసినవారికి అప్పుడే ధైర్యం వచ్చింది. ‘‘హమ్మయ్య.. కేసీఆర్ బాగానే ఉన్నారు. ఆయన్ని ఎలాంటి స్థితిలో, ఎక్కడ స్ట్రెచర్ మీద చూడాల్సి వస్తుందోనని భయపడ్డాం. కానీ.. అవేమీ లేకుండానే, మామూలుగానే వచ్చివెళ్లారు. ఇంతకన్నా ఇంకేం కావాలి. కరోనాని ముఖ్యమంత్రి ఖచ్చితంగా జయిస్తారు. మనం ఇక గుండె మీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. మన బాగోగులు, మంచీచెడ్డా సీఎం కేసీఆరే చూసుకుంటారు’’ అని ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు అందరూ అనుకున్నారు.

చిన్న బ్యాడ్ న్యూస్..

సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉంటున్న మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కి సైతం ఆ మహమ్మారి సోకటం తెలంగాణ అభిమానులకు కాస్త బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే వాళ్లిద్దరూ యువకులు, ఉత్సాహవంతులు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ముందే, వేగంగా కోలుకుంటారనటంలో ఎలాంటి సందేహమూలేదు.

Advertisement