జి‌హెచ్‌ఎం‌సి యుద్ధం : విన్నర్ ని డిసైడ్ చేయబోతోన్న చంద్రబాబు ?

PBN - December 2, 2020 / 08:45 AM IST

జి‌హెచ్‌ఎం‌సి యుద్ధం : విన్నర్ ని డిసైడ్ చేయబోతోన్న చంద్రబాబు ?

గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించటం కోసం ప్రధాన పార్టీలన్నీ బాగానే కష్టపడ్డాయని చెప్పవచ్చు. ప్రధానంగా తెరాస, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీపడ్డాయి. అయితే కాంగ్రెస్ మరియు టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. కాంగ్రెస్ కు ఒకటి అరా చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది, కానీ టీడీపీకి అలాంటి అవకాశం లేదని తెలిసిన కానీ పోటీ చేసిదంటే దానికి కారణం తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికి తప్ప మరొకటి లేదు.

cbn

ముందు నుండి టీడీపీ చెపుతున్న వాదన చూస్తే , గ్రేటర్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కవుగా ఉన్నారు, ముఖ్యంగా కమ్మవారు అధిక సంఖ్యలో ఉన్నారు, వాళ్ళనందరు మరోసారి టీడీపీని ఆదరిస్తారనే నమ్మకంతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నామని చెపుతున్నారు. నిజమే గ్రేటర్ పరిధిలో దాదాపు 35 లక్షల సీమాంధ్రులు ఉన్నారు. గ్రేటర్ పరిధిలోనే ఎందుకంటే 150 డివిజన్లలో కనీసం తక్కువలో తక్కువ 40 డివిజన్లలో సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నది అందరికీ తెలిసిందే.

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, నిజాంపేట, కొంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి,నల్లకుంట, ఓల్డ్ బోయినపల్లి, ఉప్పల్, వనస్ధలిపురం, బాచుపల్లి, మియాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, పఠాన్ చెఱువు లాంటి అనేక ప్రాంతాల్లో సీమాంధ్రులదే డామినేషన్. అందులో కూడా మెజారిటీ కమ్మ సామజిక వర్గానికి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ కి ఓట్లు వేశారా అనేది అనుమానం.

సీమాంధ్రులు ఓట్లు ఎక్కువ శాతం బీజేపీ పార్టీకి మళ్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కొందరు కీలక నేతలకు అందుకు తగ్గ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు చెప్పినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడ్డాయా ? అన్నదే అనుమానంగా మారింది.

ఎందుకంటే మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఒకవేళ గ్రేటర్ లో కమలంపార్టీనే పై చేయి సాధించినా రాష్ట్రప్రభుత్వాన్ని కాదని చేయగలిగేది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందే. ఈమాత్రం దానికి టీఆర్ఎస్ ను కాదని బీజేపీ కి ఓట్లేసి జరిగే ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా సీమాంధ్రులే తమను ఓడించారనే మంట అధికార టీఆర్ఎస్ లో మొదలైతే భవిష్యత్తులో చాలా నష్టాలుంటాయి.

దీర్ఘకాలిక ప్రయోజనాలను చూస్తే ఇది సీమాంధ్రులకు తీరని నష్టం జరుగుతుందని చాలామంది గ్రహించారు. అందుకనే చంద్రబాబు చెప్పినా కమ్మ సామాజికవర్గంలో కూడా బీజేపీకి ఓట్లు పడేది అనుమానమే అంటున్నారు. మరలాంటపుడు ఓట్లు ఎవరికి వేశారు అనేది అనుమానం.. 4 వ తేదీ ఫలితాలు వస్తేగాని సీమాంధ్రులు ఎవరికీ మొగ్గు చూపారో కానీ తెలియదు

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us