Gautam Gambhir: గంభీర్‌ని చంపుతామంటూ బెదిరింపులు.. క‌ట్టుదిట్టం చేసిన భ‌ద్ర‌త‌

Gautam Gambhir: టీమిండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న రాజ‌కీయాల‌తో పాటు క్రికెట్ విష‌యాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఆయ‌న‌కు తాజాగా చంపుతామని ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

Gautam Gambhir 'receives' death threat2
Gautam Gambhir ‘receives’ death threat2

ఈ మెయిల్స్‌ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయని మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు గంభీర్. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై తాము దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు.

గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. 15 ఏండ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గౌతం గంభీర్‌ 2018లో రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.

గౌతమ్ గంభీర్ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు భారత ఆటగాడు అజింక్య రహనేపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదని, ఎవరూ కూడా గొప్పలు చెప్పుకోవద్దని, మన గురించి ఇతరులు మాట్లాడుకోవాలన్నాడు.

Gautam Gambhir 'receives' death threat1
Gautam Gambhir ‘receives’ death threat1

గతంలో తాము ప్రపంచకప్ గెలిచిన జట్టు అత్యుత్తమైన జట్టు అని మేము ఎప్పుడు చెప్పలేదని ఆ మాట అభిమానులకే వదిలేశామని, అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ భారత జట్టు గెలవడంతో ఈ విజయం 1983లో ప్రపంచకప్ గెలిచిన దానికంటే గొప్ప విజయమని రవిశాస్త్రి అనడం గంభీర్ తప్పుపట్టాడు. అజింక్య రహనే తన ఆట వల్ల కాకుండా అదృష్టం వల్లనే ఇంకా టీంలో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడని సెటైర్ వేశాడు.