Gajjala Srinivas Attempted Suicide For Bandi Sanjay : బండి సంజయ్ కోసం ఆత్మహత్య యత్నం

NQ Staff - July 4, 2023 / 08:56 PM IST

Gajjala Srinivas Attempted Suicide For Bandi Sanjay : బండి సంజయ్ కోసం ఆత్మహత్య యత్నం

Gajjala Srinivas Attempted Suicide For Bandi Sanjay :

బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం… బండి సంజయ్‌ కూడా తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగబోతున్నాను అంటూ కాస్త ఎమోషనల్ గా సోషల్‌ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది.

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పార్టీకి రాష్ట్రంలో అద్భుతమైన విజయాలు దక్కాయి. అయిదు పది సీట్లు దక్కించుకుంటే గొప్ప విషయం అనుకున్న స్థాయి నుండి అధికారంలోకి రాబోతున్నాం అన్నట్లుగా పరిస్థితి మారింది అంటే బండి సంజయ్ వల్లే అంటూ ఆయన అభిమానులు కొందరు కార్యకర్తలు ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తొలగించడం పట్ల మనస్థాపానికి గురి అయిన ఖమ్మం జిల్లా బీజేవైఎమ్‌ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంది అంటూ జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

గజ్జల శ్రీనివాస్ సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో… నా పేరు గజ్జల శ్రీనివాస్‌. ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షుడిని. బండి సంజయ్ అన్నని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించడం నాకు బాధకరం… నేను జీర్ణించుకోలేక పోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ పేర్కొన్న గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us