Agneepath : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో పోలీసుల కాల్పులు.. ఆందోళ‌న‌కారుల‌కి గాయాలు, ఒక‌రు మృతి

NQ Staff - June 17, 2022 / 11:38 AM IST

Agneepath : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో పోలీసుల కాల్పులు.. ఆందోళ‌న‌కారుల‌కి గాయాలు, ఒక‌రు మృతి

Agneepath : అగ్నిప‌థ్ జ్వాల సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ని అగ్నిగుండంగా మార్చేసింది. ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. శుక్రవారం కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. ఐతే కొందరు ఆందోళనకారులు స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు.

ఆగ్ర‌హ జ్వాలలు…

స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ప్లాట్‌ఫారమ్‌లపై నిలిపి ఉన్న మూడు రైళ్లను తగులబెట్టారు. స్టేషన్‌లో ఉన్న పార్సిళ్లను పట్టాలపై వేసి నిప్పంటించారు. పలు రైళ్ల మంటల్లో తగలబడడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమ్యారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో రైళ్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందలాది మంది యువకులు రాళ్లు రువ్వుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను రైల్వే స్టేషన్ నుండి పంపించేందుకు గాను పోలీసులు కాల్పులకు దిగారు.

 Flames Of Agneepath Turned Secunderabad Railway Station Fire Pit

Flames Of Agneepath Turned Secunderabad Railway Station Fire Pit

సుమారు 15రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు.ఆందోళనకారులపై బాష్పవాయువుతో పాటు రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు. అయిన‌ప్ప‌టికీ వారు త‌గ్గ‌ట్లేదు. ఓ నిర‌స‌న‌కారుడు గాయ‌ప‌డ‌గా, గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ యువకుడు మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కానిస్టేబుల్స్‌కి కూడా గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. రైల్వే స్టేష‌న్‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. గొడ‌వ‌ల నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.

వందల మంది ఒకే సారి స్టేషన్ లోకి చేరుకోవటం.. వస్తూనే విధ్వంసానికి పాల్పడటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి సైతం వారిని నియంత్రించటం కష్టంగా మారింది. ముఖాలకు ముసుగులు వేసుకొని.. స్టేషన్ లోని సీసీ కెమేరాలను సైతం ధ్వంసం చేసారు. ప్లాట్ ఫాంల పైన ఉన్న స్టాల్స్ ను ధ్వంసం చేసారు. నిలిచి ఉన్న రైలు బోగీల్లోనూ నిప్పు పెట్టారు.

 Flames Of Agneepath Turned Secunderabad Railway Station Fire Pit

Flames Of Agneepath Turned Secunderabad Railway Station Fire Pit

ప్లాట్ ఫాంలపైన ఉన్న స్టాల్స్ పూర్తిగా ధ్వంసం చేసారు. రెండు గంటల పాటు విధ్వంస కాండ కొనసాగింది. రెండు రైలు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. రైళ్ల పైన రాళ్లు విసరటంతో ప్రయాణీకులు బయటకు పరుగులు తీసారు. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సికింద్రాబాద్ చేరుకోవాల్సిన రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేసారు. ఊహించని విధంగా జరిగిన దాడితో అందరూ షాక్ అయ్యారు. ఆగ్నపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు కొనసాగించాలని నినాదాలు చేసారు. పెద్ద రాళ్లతో రైళ్ల కిటికీలను ధ్వసం చేసారు. ప్రయాణీకులు లోపలే ఉన్నా..దాడులు చేసారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us