ట్రంప్ పోస్టులు తొలగించిన ట్విట్టర్, ఫేస్ బుక్

Advertisement

కరోనాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న పోస్టులు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని, అవి తమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల ట్రంప్ చేస్తున్న పోస్టులను తొలగిస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ వెల్లడించాయి. చిన్న పిల్లలకు దాదాపు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

అయితే ఈ వీడియోస్ లో ట్రంప్ ప్రస్తావించిన అంశాలు కరోనాపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు ఆ వీడియో క్లిప్ ను తోలగించాయి. దీనిపై ట్రంప్ ప్రతినిధి కర్టనీ పారెల్లా స్పందిస్తూ.. ట్రంప్‌ మాట్లాడింది వాస్తవమని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయాలనే వెల్లడించారని, సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయనిర్ణేతలు కారని మండిపడ్డారు. అధ్యక్షుడు పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయని నిందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here