Congress Party : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. చివరి క్షణంలో బిగ్ ట్విస్ట్‌

NQ Staff - September 30, 2022 / 01:20 PM IST

Congress Party : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. చివరి క్షణంలో బిగ్ ట్విస్ట్‌

Congress Party : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతున్న విషయం తెల్సిందే. గాంధీ కుటుంబంకు చెందిన సోనియా గాంధీ కానీ రాహుల్‌ గాంధీ కానీ ఈసారి ఎన్నిక పోటీలో నిలవడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు ఆ పదవిపై మోజు పెంచుకున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు.

ఇప్పటికే అధ్యక్ష పదవికి శశి థరూర్ మరియు దిగ్విజయ్ సింగ్ లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సమయంలో పార్టీ అధినాయకత్వం అయిన సోనియా గాంధీ మరియు రాహుల్‌ గాంధీ మనసులో మల్లికార్జున ఖర్గే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. చివరి నిమిషంలో ఆయన లైన్ లోకి వచ్చారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌

పక్ష నేతగా కూడా ఆయనకు సోనియా గాంధీ కీలక పదవి ఇచ్చారు. ఆ సమయంలో ఆయన విశ్వాసంగా వ్యవహరించారు. అందుకే సోనియా గాంధీ అధ్యక్ష పదవి కూడా ఆయనకు అప్పగిస్తే భవిష్యత్తులో గాంధీ కుటుంబంకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరో వైపు ప్రియాంక గాంధీ పేరు కూడా ప్రచారం జరిగింది. కానీ గాంధీ కుటుంబ నుండి ఈసారి ఎవరు కూడా అధ్యక్ష రేసులో ఉండటం లేదు అంటూ సీనియర్‌ లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. నామినేషన్‌ లకు చివరి రోజు నేడు. నేడు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us