గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల సంఘం భారీ షాక్ : కారణం అదేనా..?

PBN - December 1, 2020 / 12:47 PM IST

గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల సంఘం భారీ షాక్ : కారణం అదేనా..?

అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. గ్రేటర్ లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు బాగానే కష్టపడ్డాయి. దాదాపు పది రోజులు హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ఈ రోజు ఎన్నికల పోలింగ్ పక్రియ మొదలైంది. డిసెంబర్ 4 న ఈ ఫలితాలు వెల్లడించనున్నారు, అయితే ఈ లోపే సాధారణంగా ఎన్నికల ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. కొన్ని కొన్ని సంస్థలు స్వతంత్రంగా సర్వే నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయి, అయితే ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో ఈ నెల మూడో తేదీ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటంతో ఎగ్జిట్ పోల్స్ కు బ్రేక్ పడింది.

ghmc exit polls

ఇదే కారణం

ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లోని 5 కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. పార్టీ గుర్తులు తారుమారు కావటంతో 1,2,3,4,5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆపేశారు . బ్యాలెట్ పత్రంలో సీపీఐ అబ్యర్దికి ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తుకు ముద్రించారు. కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి రావటంతో సిపిఐ పార్టీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు . దీనితో పోలింగ్ కు కాసేపు నిలిపివేశారు. అక్కడ జరిగిన పొరపాటుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆ డివిజన్ పరిధిలో సుమారు 69 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 3 వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు విడుదల చేయటానికి కుదరదంటూ ఎన్నికల సంఘం సూచించింది. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దీ గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ నివేదికలు బయటకొస్తాయి. అయితే 3 వ తేదీ రీపోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయితే వాటి ప్రభావం పోలింగ్ మీద ఉంటుందని భావించి ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ కు బ్రేక్ వేసింది. దీనితో ఇక గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కోసం 3 వ తేదీ సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us