Bharat Judo Yatra : భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్ సస్పెండ్
NQ Staff - December 4, 2022 / 04:23 PM IST

Bharat Judo Yatra : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జూడో యాత్రలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. ఆ టీచర్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేశారు.
మధ్య ప్రదేశ్ లోని కనస్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకి అతీతంగా సాగుతున్న యాత్ర పాల్గొనేందుకు టీచర్ వెళ్ళగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ప్రజా సంఘాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్ లోని ఆదివాసి వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్కూల్లో రాజేష్ కన్నోజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నవంబర్ 24 వ తారీఖున రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు.
తాను వేసిన పెయింటింగ్స్ ని బహుకరించడంతో పాటు కొంత దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ని అతిక్రమించి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు అంటూ రాజేష్ తీరుకు వ్యతిరేకంగా విద్యాధికారులు సస్పెన్షన్ లెటర్ ను ఇచ్చారు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.