Andhrapradesh : బంతి చంద్రబాబు కోర్టులోనే.! సీఎం పదవికి వదులుకుంటారా.?
NQ Staff - October 30, 2022 / 05:33 PM IST

Andhrapradesh : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇటీవల పార్టీ శ్రేణుల్ని, ముఖ్య నేతల్ని ఉద్దేశించి ‘త్యాగాలకు సిద్ధమవ్వాలి..’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేన అలాగే టీడీపీతో పొత్తు దిశగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అయితే, అప్పుడే ఎన్నికల హంగామా కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.! జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైపోయిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే జనసేనకు కేటాయించేది 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమేనన్నది టీడీపీ నుంచి బయటకు వస్తున్న లీకుల సారాంశం.
ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అయితేనే..
ముప్ఫయ్ సీట్లు జనసేనకు కేటాయించడం చాలా చాలా ఎక్కువన్న భావన టీడీపీలోనూ వుంది. కానీ, జనసేన మాత్రం తాము అన్ని సీట్లలోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగల శక్తితో వున్నామనీ, టీడీపీకే తాము సీట్లను ఆఫర్ చేస్తామని అంటోంది.
ఇంకోపక్క బీజేపీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే.. అందుకు అంగీకరిస్తేనే టీడీపీతో పొత్తు.. అన్నట్లు మాట్లాడుతోంది. ఈ విషయమై చంద్రబాబు ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
నేరుగా బీజేపీ – టీడీపీ – జనసేన వర్గాల మద్య ఈ మేరకు చర్చలు జరగక పోయినా, తెరవెనుకాల నడవాల్సిన వ్యావహారాలు నడిచి పోతున్నాయి. చంద్రబాబు గనుక ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించకపోతే, త్వరలోనే ఈ పొత్తు ఖాయమైపోయే అవకాశం వుందట. సో, బంతి టీడీపీ కోర్టులోనే వుందన్నమాట.