ఇలాంటివి బయట పడితే పోయేది జగన్ పరువే అని తెలీదా వీళ్ళకి ?

cm jagan mohan reddy n
cm jagan mohan reddy n

జగన్ ముఖ్యమంత్రి అయ్యి కేవలం 16 నెలల సమయమే అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరక అనేది లేకుండా ఎంతో జాగురతతో పరిపాలన చేస్తున్నాడు జగన్. అయితే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పట్ల రాజ్యాంగపరంగా అనేక సమస్యలు వస్తున్నాయి. సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు అనేక సార్లు తప్పు పట్టాయి. ఈ ఒక్క విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తున్నాడు అనే మాటలు సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి.

cm jagan mohan reddy n

ఇలాంటి తరుణంలో జగన్ కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ 16 నెలల్లో జగన్ పర్యటనలకు దాదాపు 26 కోట్లు ఖర్చు అయ్యినట్లు లెక్కలు అధికారికంగా బయటకు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు మరియు తటస్థ వేదికలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కాదు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రతీ విషయంలో కూడా తప్పుగా చూపించింది. ఇక విదేశీ పర్యటనలు చంద్రబాబు నాయుడు చేస్తుంటే ప్రతీ అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన అనవసరంగా పర్యటనలు చేస్తున్నారు అని, ఆడంబరాలకు పోతున్నారని అసభ్యంగా పోస్టులు చేసేవారు. ఈ పర్యటనల వలన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దిగజారింది అని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసెంబ్లీలో నానా మాటలు మాట్లాడారు.

చంద్రబాబు ఐదేళ్ల పదవి కాలంలో దాదాపు 39 కోట్లు పర్యటనలకు ఖర్చు పెట్టారని వైసీపీ నేతలే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అదే సమయంలో దాదాపు ఐదు లక్షల 13 వేల ఉధ్యోగాలు తెచ్చాడని అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పుడు జగన్ కేవలం 16 నీళ్ళల్లో 26 కోట్లు అంటే మాములు విషయం కాదు. గతంలో కంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.

మరి ఇప్పుడు జగన్ 26 కోట్లు ఖర్చు పెట్టి ప్రయాణాలు చేయటం ద్వారా రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది,?, ఏమైనా కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రకు వచ్చి పెట్టుబడులు పెట్టాయా అంటూ..? ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అదే సమయంలో సామాన్య జనాలు కూడా ఈ పర్యటనల లెక్కలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అధికార పార్టీ మీద ఉంది. ఇలాంటి వాటిపై చర్చలు జరిగితే పోయేది జగన్ పరువే.. ఆ విషయం తెలిసి కూడా ఈ లేఖలు అధికారంగా ఎలా ప్రకటించారు అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం

Advertisement