కరోనా విషయంలో జగన్ చేతులెత్తేశాడా ..?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.. రోజుకు పదివేలకు మించి కేసులు నమోదు అవుతున్నాయి.. గత రెండు రోజుల నుండి 60 కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం జగన్ వ్యవహారశైలి గతంలో కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. మొదటి దశలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనపరిచిన సీఎం సెకండ్ వేవ్ లో మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించటమే లేదు..

మీటింగ్ లు పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలనీ ఆలోచిస్తున్నాడు కానీ కరోనా గురించి మాత్రం పట్టించుకోవటం లేదు సీఎం జగన్ అంటూ ప్రతిపక్షలు ఆరోపణలు ఎంత వరకు నిజమో కానీ, సీఎం వరస మీటింగ్ లు పెడుతున్న కానీ రాష్ట్రంలో కరోనా విషయంలో పెద్ద ముందడుగు అంటూ ఏమి లేదు.. ఎక్కడ మార్కెట్స్ అక్కడ యధాతధంగా జరుగుతున్నాయి, ప్రతి చోట లెక్కలు మించి జనాలు జాతర కనిపిస్తుంది. కొన్ని చోట్ల వాళ్లకు వాళ్లే మాట్లాడుకొని కర్ఫ్యూ లాంటిది పాటిస్తున్నారు తప్పితే, ప్రభుత్వం పరంగా గట్టి నిర్ణయాలు లేవు.

ఇక బార్ లు వైన్ షాప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. రాష్ట్రంలో మద్యాన్ని అమ్ముతుంది రాష్ట్ర ప్రభుత్వమే అయినాగానీ ఎక్కడ కూడా వైన్ షాప్స్ ముందు జాగ్రత్తలు పాటిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. వాటి మీద ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు ప్రభుత్వం. అసలే కరోనా సమయంలో ఆదాయం కూడా సరిగ్గా రావటం లేదు. ఇలాంటి సమయంలో బార్ లు మరియు వైన్ షాప్ ల మీద ఆంక్షలు విధిస్తే రాష్ట్రము రోడ్డున పడినట్లే అవుతుంది పాలకులు దీనిపై మౌనంగా ఉండవచ్చు..

India stampede 'kills 27 pilgrims' in Andhra Pradesh - BBC News

ప్రత్యేకమైన కోవిడ్ కేంద్రాల ఏర్పాట్లు లేవు. గతంలో కమ్యూనిటీ హాళ్లలో సైతం పడకలు ఏర్పాటు చేసారు. అది కూడా ముందుగా. కానీ ఇప్పుడు అలాంటి జాడలు కనిపించడం లేదు. ఇక ట్రైస్,ట్రాక్, ట్రీట్ అనే పద్దతి ని ఫస్ట్ ఫేజ్ లో పాటించారు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో ఆర్బాటంగా ప్రారంభించిన 104,108 వాహనాలు కూడా ఎక్కడ పెద్దగా కనిపించటం లేదు.. వాటి బాధ్యత చూస్తున్న అరబిందో సంస్థ వీటిపై వివరణ కూడా ఇవ్వలేదు.. ప్రభుత్వమే వాటిని పట్టించుకోని పక్షంలో ప్రయివేట్ సంస్థలు ఎందుకు సంజాయిషీ ఇస్తాయి.. ఇలా చూసుకుంటే వెళ్తే మొదటి దశలో కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకున్న సీఎం జగన్ రెండో దశకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లు ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

పైగా లాక్ డౌన్ పెడితే ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయని భావించిన కేంద్రం తెలివిగా ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించి చేతులు దులుపుకొని పక్కకు తప్పుకుంది. గతంలో లాక్ డౌన్ పెట్టిన సమయంలో నిధుల కోసం రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీశాయి. దీనితో అలాంటి పరిస్థితి రాకూడదని కేంద్ర పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనితో బాల్ రాష్ట్రాల పరిధిలో పడటంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నాయి.. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో

Advertisement