Chandra Babu: మోడీనే చంద్రబాబు టార్గెట్ చేశాడా..? అంత ధైర్యం వచ్చిందా..?

Chandra Babu దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ప్రధాని మోడీ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అంటే భయపడే కొందరు నేతలు మౌనం వహిస్తున్న కానీ, మరికొందరు మాత్రం బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీకి అనుకూలమో లేక వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా బాబు మాటలు వింటే మాత్రం మోడీకి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం చేసుకోవచ్చు.

chandrababu modi

బాబు మాట్లాడుతూ ఈ రోజు మనందరం సంక్షోభంలో ఉన్నాం. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించినా కొన్ని దేశాలు సమర్ధవంతంగా ముందుకెళ్లి పాజిటివ్ ఫలితాలు కూడా సాధించారు. ఇప్పుడు రెండవ వేవ్ మొదటి వేవ్ కంటే చాలా ఉధృంతంగా ఉంది. మొదటి వేవ్ లో నేర్చుకున్న గుణపాఠాలను బేరీజు వేసుకుని రెండవ వేవ్ లో చర్యలు తీసుకోవడంలో మనం విఫలమయ్యాం. రెండవ వేవ్ ను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి. డబ్బులు కంటే ప్రాణం చాలా ముఖ్యమైంది. ఎవరు ఉంటారో, ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు చాలా భాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడటం జరిగింది.

ఈ వ్యాఖ్యలను గమనిస్తే కేంద్రం మీదే విమర్శలు చేసినట్లు అర్ధం చేసుకోవచ్చు. పై వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా రాష్ట్రాన్ని విమర్శించిన దాఖలాలు లేవు పైగా దేశాలు అంటూ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా కేంద్రాన్ని ఉద్దేశించే అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.. 2019 నుండి ఇప్పటి వరకు మోడీ భజన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడిలా ప్రధాని పేరు ఎత్తకుండా విమర్శలు చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో అలోచించి నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు లాంటి నేత కేంద్రాన్ని తప్పు పడుతూ మాట్లాడటం అనేది ఆలోచించవలసిన విషయమే

Advertisement