వైసీపీ రాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి పనిచేశాడా ..?
PBN - March 5, 2021 / 11:23 AM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలకు తిరుగులేదని చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నేతలు ఏమైనా తమ దర్పం చూపించాలన్న ముందు వెనుక ఆలోచించే పరిస్థితి ఉంటుంది. పైగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు వేడి రాజుకుంది. ఈ సమయంలో చేస్తే గిస్తే వైసీపీ నేతలు బలవంతపు రాజకీయం చేయాలి కానీ, ప్రతిపక్షాలు చేయటం అనేది కొంచం విచిత్రమైన పరిస్థితి అనే చెప్పాలి.
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు.
టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ చేసేవాళ్ళు లేకుండా పోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రవికుమార్ వైఎస్సార్‌సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు.
8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య ఖండించారు. టీడీపీ తరుపున నామినేషన్ వేసినా మీ వాళ్లే వచ్చి ఉపసంహారణ చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలియదా..? ఎదో చంద్రబాబు దగ్గర షో చేయటం కోసం మా అభ్యర్థిని బలవంతంగా నువ్వు తీసుకోని వచ్చి నామినేషన్స్ ఉపసంహరణ చేపిస్తావా..?
ఈ విషయాన్నీ తేలికగా వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి. నీ తీరు ఎదగడుతామని బాచిన కృష్ణ చైతన్య హెచ్చరించటం జరిగింది. అయిన టీడీపీ వాళ్ళు వచ్చి ఉపసంహరణ చేసుకున్నారని నీకు తెలియదా అని కృష్ణ చైత్యన ఎమ్మెల్యే గొట్టిపాటిని అడిగేముందు మీ అభ్యర్థిని టీడీపీ వాళ్ళు తీసుకెళ్తున్న విషయం నువ్వు ఎలా తెలుసుకోలేకపోయావు అంటూ ఎవరైనా అడిగితే వైసీపీ ఇంచార్జి ఏమని సమాధానం ఇస్తాడు.