తిరుపతి లో ఓటమి.. టీడీపీకి మేలు చేస్తుందా..?

తిరుపతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అందరికి ముందే తెలుసు. తిరుపతి ఎలాగూ వైసీపీ సిట్టింగ్ స్థానం. అధికారంలో వైసీపీ పార్టీనే ఉంది కాబట్టి, తిరుపతి ఫలితంపై ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన కానీ చంద్రబాబు నాయుడు తిరుపతి మీద ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోని మరి ఎన్నికల వ్యూహాలు రచించాడు. ఎందుకయ్యా అంటే వైసీపీ అంటున్నట్లు 5 లక్షల మెజారిటీ రాకుండా చూడటం కోసమే అని అందరు అనుకున్నారు.

కానీ దీని వెనుక మరోకోణం ఉందని కొందరు విశ్లేషకులు చెపుతున్న మాట. 2019 లో మోడీని వ్యతిరేకించి బయటకు వచ్చి అతిపెద్ద తప్పు చేశానని చెపుతూ చంద్రబాబు ఇప్పటికి బాధ పడుతాడని అయన సన్నిహిత వర్గాలు చెపుతాయి. ఆ తర్వాత బీజేపీకి దగ్గర కావాలని చూసిన కానీ పెద్దగా ఫలితం లేదు. ఇలాంటి సమయంలో తిరుపతి లో గట్టిగా పోరాడి వైసీపీకి ఎదురు నిలిస్తే బీజేపీ దృష్టిలో పడవచ్చని బాబు ఆలోచనగా చెపుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి. తిరుపతిలో రెండు పార్టీలు కలిసిన కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావటం జరిగేపని కాదని తేలిపోయింది. కాబట్టి ఆ రెండు పార్టీలకు ఖచ్చితంగా టీడీపీ పార్టీ అవసరం ఉంది. రాష్ట్రంలో మనుగడ సాగించాలంటే టీడీపీ చేయూత ఆయా పార్టీలకు అవసరం. చంద్రబాబు కూడా ఇదే విధంగా అలోచించి తిరుపతిలో ఓడిపోతామని తెలిసిన కానీ, గెలుపు కోసం కాకుండా మెరుగైన ఫలితాల కోసం పనిచేయాలని భావించి అందుకు తగ్గట్లు పనిచేశారు.

ఒక రకంగా చూసుకుంటే తిరుపతిలో టీడీపీ ఓడిపోయిన కానీ చంద్రబాబు అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వచ్చినట్లే అని చెప్పాలి. 2024 లో జగన్ ను ఢీ కొట్టాలంటే అన్ని పార్టీలు ఏకంగా కావాల్సిన అవసరాన్ని తిరుపతి ఎన్నికలు రుజువుచేశాయి కాబట్టి బీజేపీ పార్టీ ఒక మెట్టు కిందకు దిగి బాబుతో చెలిమికి పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే జనసేన కూడా పొత్తులో కలిసిపోవడం ఖాయం.

Advertisement