YCP : పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యేదెవరు.?
NQ Staff - May 10, 2022 / 11:35 AM IST

YCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశం లేదా.? ఆ ఎన్నికల్లో విపక్షాల్లో ఎవరు గెలుస్తారు.? అన్నదానిపై వైసీపీ ఎందుకు పంచాయితీ పెడుతోంది.? వైసీపీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఇది.
ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే, వైసీపీకి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే, ఏకంగా తమ లెక్క 175 అంటున్నారు. అంటే, టీడీపీ అలాగే జనసేన.. ఇంకోపక్క బీజేపీ.. ఈ మూడూ గుండు సున్నాలేన్నమాట.
వైసీపీ ఇంత ధీమాగా వున్నప్పుడు, చంద్రబాబు ముఖ్య మంత్రి అవుతారా.? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా.? అంటూ వైసీపీ ఎందుకు రాజకీయ పంచాయితీ పెడుతోంది.? పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తారా.? చంద్రబాబుని ముఖ్య మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తారా.? అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు.

Debate YCP Factions Who CM Upcoming Elections
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం వుంది. ఈ రెండేళ్ళలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం ఎలా.? కేంద్రం మెడలు వంచి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి.. కడప స్టీలు ప్లాంటు నిర్మించి, దుగరాజపట్నం పోర్టు తీసుకొచ్చి.. మూడు రాజధానుల్ని నిర్మించి, శాసన మండలిని రద్దు చేయించడమెలాగో చేసి చూపించాల్సిన బాధ్యత వైసీపీ మీద వుంది.
ఈ కీలకమైన అంశాల్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా.? చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా.? అనే పంచాయితీని ఎందుకు వైసీపీ ప్రచారంలోకి తీసుకొస్తోందో ఏమో.! బహుశా వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం వైసీపీలో పోయినట్టుంది.!