Nitish Kumar : జేడీయూ ఎంఎల్ఏలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు.. కొద్ది సేపట్లో ఆడియో ఔట్
NQ Staff - August 9, 2022 / 02:52 PM IST

Nitish Kumar : బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముగింపు పలకబోతున్నారా అనే చర్చ జోరందుకుంది. ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం నితీశ్ కుమార్ తిరిగి మహాకూటమితో జట్టుకట్టనున్నారా? విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాకూటమి 2.0 సర్కారు ఏర్పాటుకు జేడీయూ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రంగం సిద్ధం చేస్తున్నారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
సంతల్లో పశువుల్లా..
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77 సీట్లు, జేడీయూకు 45 సీట్లు వచ్చాయి. అయినా బీజేపీ అధిష్టానం నితీశ్‌నే సీఎం చేసింది. అయితే జేడియూపై పూర్తిగా బీజేపీ పట్టు సాధించిందని నితీశ్ అనుమానిస్తున్నారు. తన పార్టీకే చెందిన కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌కు రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగియడంతో ఆయన్ను కొనసాగించడం నితీశ్‌కు ఇష్టం లేదు .

debate whether Nitish Kumar End Coalition Government with BJP in Bihar
బీహార్‌లోనూ అమిత్ షా ప్రభావం పెరగడం… జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయన మాటే వినడం నితీశ్ కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కొన్ని నెలలుగా బీజేపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు. రాష్ట్రంలో పొసగని విధంగా ఉంటున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ మాత్రం నితీష్ కుమార్ పట్ల సాదరంగా వ్యవహరిస్తున్నది.
రీసెంట్‌గా జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ సహా రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రమాణం సహా ఇతర కార్యక్రమాలకు కేంద్రం పిలిచినప్పటికీ నితీష్ హాజరుకాలేదు. నితీశ్ ఆదేశాలకు విరుద్దంగా ఆర్సీపీ సింగ్ ను కేంద్ర మంత్రిని చేయడంతో బీజేపీ తీరుపై సీఎం గుర్రుగా ఉన్నారు.
అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టిన బీజేపీ ఇప్పుడు జేడీయూకి కూడా కోలుకోలేని షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంఎల్ఏలతో సంప్రదింపులు చేస్తుండగా, ఆరు కోట్లు ముట్టజెబుతామని హామీ ఇస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ మరి కొద్ది నిమిషాలలో జేడీయూ రిలీజ్ చేయనుందని తెలుస్తుంది.