Ippatam Villagers : ఇప్పటం.. జనసేనానికి అత్యంత ఇబ్బందికరం.!
NQ Staff - November 24, 2022 / 06:28 PM IST

Ippatam Villagers : ఇప్పటం.. కొన్నాళ్ళ క్రితం ఈ ఊరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. వైసీపీ ప్రభుత్వం, ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరుతో, ఇళ్ళను కూల్చేసిందన్నది ప్రధాన ఆరోపణ. కూల్చివేతకు గురైన ఇళ్ళన్నీ ఓ సామాజిక వర్గానికి చెందినవారివనీ, వారంతా గతంలో జనసేన పార్టీ బహరింగ సభ కోసం తమ భూముల్ని ఇచ్చారనీ, అందుకే వారిపై కక్ష సాధింపు చర్యలనీ ఆరోపణలు వచ్చాయి.
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళారు. ఈ క్రమంలో హైడ్రామా నెలకొంది. వాహనం టాప్ పైన కూర్చుని, హైవేలో పవన్ కళ్యాణ్ వెల్ళిన వైనం పెను దుమారం రేపింది. ఆయన మీద పోలీస్ కేసు కూడా నమోదయ్యింది.
గ్రామస్తులకు హైకోర్టు జరీమానా..
కాగా, కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తమకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కొందరు గ్రామస్తులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం కూల్చివేతలపై స్టే విధించింది. అయితే, విచారణలో, తాము ముందస్తు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా, న్యాయస్థానం కొందరు గ్రామస్తులకు లక్ష రూపాయల మేర జరీమానా విధించినట్లు తెలుస్తోంది.
కాగా, ఇళ్ళు ధ్వంసమైనవారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాహాయం ప్రకటించిన జనసేనాని, ఈ మేరకు ఇంకోసారి ఆయన ఇప్పటం వెళ్ళాల్సి వుంది. కోర్టు జరీమానా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తదుపరి నిర్ణయం ఎలా వుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, ఈ పరిస్థితి ఆయనకు అత్యంత ఇబ్బందికరం.