Revanth Reddy : టీడీపీ పుట్టిల్లు.. కాంగ్రెస్ పార్టీ మెట్టినిల్లు: రేవంత్ రెడ్డి.!

NQ Staff - September 24, 2022 / 09:10 AM IST

Revanth Reddy : టీడీపీ పుట్టిల్లు.. కాంగ్రెస్ పార్టీ మెట్టినిల్లు: రేవంత్ రెడ్డి.!

Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ తనకు పుట్టిల్లు అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని మెట్టినిల్లుగా పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన తనను తాను ‘కోడలు’గా అభివర్ణించుకున్నారు. అంటే, టీడీపీ ఆడబిడ్డ అయిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కోడలిగా వెళ్ళారన్నమాట. ఛీ..ఛీ.. ఇదేం పోలిక.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Congress Leader Revanth Reddy Comments on TDP

Congress Leader Revanth Reddy Comments on TDP

నిజమే మరి, తనను తాను కోడలిగా పోల్చుకోవడమేంటి.? అంతకన్నా ఇల్లరికం అల్లుడిగా వెళ్ళిపోయాననడం సబబేమో.. అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్. చంద్రబాబే కాంగ్రెస్‌లోకి రేవంత్ రెడ్డిని పంపారా.? కాంగ్రెస్ అనే అత్తవారింటికి రేవంత్ రెడ్డిని ఎవరో ఒకరు పంపి వుండాలి కదా.? పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీనే, రేవంత్ రెడ్డిని మెట్టినింటికి.. అంటే కాంగ్రెస్ పార్టీలోకి పంపిందన్నమాట.

సో, మేటర్ క్లియర్.. చంద్రబాబే, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపారన్నమాట. టీడీపీలో కీలక నేతగా వున్న రేవంత్ రెడ్డి, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది. అన్నట్టు చంద్రబాబు కూడా పూర్వపు రోజుల్లో కాంగ్రెస్ మనిషే.! బీజేపీతో విభేదించి 2018 సమయంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చీఫ్ జత కట్టిన విషయం కూడా అందరికీ గుర్తుండే వుంటుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us