CM KCR : బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న కవిత.. కేటీఆర్ తెలంగాణకే..!
NQ Staff - January 18, 2023 / 12:08 PM IST

CM KCR : కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ ను పెంచుతున్నాడు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్ గా ప్రకటించాడు. అంతే కాకుండా డిల్లీలో పార్టీ ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేశాడు. దాంతో పాటు మొదటిసారి ఏపీలో జాయినింగ్స్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఖమ్మంలో నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ఐన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్ లాంటి వారు వచ్చారు
వారితో పాటు అఖిలేష్ యాదవ్ కూడా ఈ మీటింగ్ కి హాజరవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఓ విషయం ఇక్కడ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అదేంటంటే బీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత బలమైన నాయకుడు అంటే కేటీఆర్. రేపటి తరంలో బీఆర్‌ఎస్ పగ్గాలు తీసుకునేది కూడా కేటీఆర్. అలాంటి కేటీఆర్‌ను మాత్రం ఈ సభకు దూరంగా ఉంచుతున్నాడు కేసీఆర్. నేడు జరుగుతున్న ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు.
ఎందుకంటే ఆయన దావోస్ మీటింగ్‌కు వెళ్లడం తో కవిత మాత్రం రేపు మెయిన్ హైలెట్ కాబోతోంది. గతంలో ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా కవితను తీసుకెళ్లాడు కేసీఆర్. కానీ అక్కడకు కేటీఆర్‌ను తీసుకెళ్లలేదు. కేవలం కవితను మాత్రమే జాతీయ మీడియాలో హైలెట్ అయ్యే విధంగా చేశాడు కేసీఆర్.
ఇక ఏపీలో తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ లాంటి వారిని చేర్చుకున్నప్పుడు కూడా కేటీఆర్ అక్కడకు వెళ్లలేదు. బీఆర్ ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఒక్కసారి కూడా కేటీఆర్‌ను తన వెంట తీసుకెళ్లట్లేదు కేసీఆర్. కేవలం కవితను మాత్రమే తీసుకెళ్తున్నాడు. నేడు జరగబోయే ఖమ్మం సభలో కూడా కవితకే పెద్ద పీట వేస్తున్నారు.
జాతీయ రాజకీయాల వైపు..

CM KCR Increasing Focus On National Politics
ఇదంతా చూస్తుంటే బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో కవితనే కీలకం కాబోతుందా అనే విషయం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే కవిత మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కవితను జాతీయ రాజకీయాల వైపు నడిపించాలని కేసీఆర్ భావించడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది.
అయితే ఇదంతా ప్లానింగ్ లో భాగంగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేటీఆర్‌ను తెలంగాణ సీఎం ను చేసి.. తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక కూతురును జాతీయ రాజకీయాల్లో ఉంచితే అప్పుడు కేటీఆర్‌కు ఎలాంటి పోటీ ఉండదని, కూతురుకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారంట. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కవితనే జాతీయ రాజకీయాల్లో కీలకం అయ్యే అవకాశం మెండుగా ఉంది.