CM Jagan: దేవినేని అవినాష్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..! దశ తిరగబోతుందా..?

CM Jagan విజయవాడలో బలమైన రాజకీయ నేత దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన దేవినేని అవినాష్ కు రాజకీయంగా సానుకూలంగా పెద్దగా ఒరిగింది ఏమి లేదు. టీడీపీలోకి వచ్చిన వెంటనే ఆయనకు తెలుగు యువత అధ్యక్షుడు పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీకి దిగిన అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ లోకి చేరాడు.

devineni avinash and jagan

అయితే అప్పటికి విజయవాడలో అన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు బలంగా నాటుకొని ఉండటం, పైగా అధికారం కూడా ఉండటంతో అవినాష్ కు సరైన ప్రాంతం ఏది దొరకలేదు. దీనితో తనని తాను వైసీపీ లో నిరూపించే అవకాశం రాలేదు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ దేవినేని అవినాష్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో జరగబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను యువనేత దేవినేని అవినాష్ చేతికి సీఎం జగన్ అప్పజెప్పారు. ఈ కీలకమైన నగర కార్పొరేషన్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయగర్వంతో ఎగరాలన్న పార్టీ అధినేత ఆశల్ని నిజం చేస్తారా? అన్నది ప్రశ్న.

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరుగుతున్న మొదటి ఎన్నికలుగా వీటిని చెప్పాలి. ఏపీలోని కీలక నగరాలైన విజయవాడ.. విశాఖ లాంటి వాటిల్లో అధికార పార్టీ తన జెండా ఎగరాలని కోరుకుంటోంది. ఇందుకోసం సీఎం జగన్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో విజయవాడ లో కార్పొరేటర్ గా వ్యవహరించిన పుణ్యశీలను దాదాపుగా అభ్యర్థిగా ఖరారు చేశారనే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండేవారు. అయినప్పటికీ పార్టీ విషయంలో కమిట్ మెంట్ తో వ్యవహరించి.. నాటి అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆమె విపరీతంగా శ్రమించే వారు. ఆమె సేవల్ని గుర్తు పెట్టుకున్న జగన్.. ఆమెకే అవకాశం ఇస్తారని చెబుతున్నారు.

ఇక తన సత్తా ఏమిటో చూపించాలని ఎదురుచూస్తున్నా యువనేత దేవినినేని అవినాష్ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటాడు అనేది చూడాలి. యూత్ లో మాంచి ఫాలో యింగ్ ఉన్న అవినాష్పార్టీ జెండాను బెజవాడ కార్పొరేషన్ భవనం మీద ఎగిరేలా చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక వైసీపీ కి పోటీగా టీడీపీ నుండి కేశినేని నాని తన కూతురిని మేయర్ గా పోటీచేపించాలని చూస్తున్నాడు..

Advertisement