చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి : సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నటి నుండి మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజే సభ ఆసక్తికరంగా సాగింది. ఇక ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వడం లేదని టీడీపీ ఆందోళన చేయడంతో చంద్రబాబుతో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులను సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. ఇక ఇది ఇలా ఉంటె రెండవ రోజు కూడా అదే స్థాయిలో హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అయితే అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది.

ఇక సమావేశాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై సీఎం జగన్ తివ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మండిపడ్డాడు. వైసీపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఉన్న విషయాలను మాట్లాడుతుంటే చంద్రబాబు మాత్రం ఏదో ఏదో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. తొందర్లోనే చంద్రబాబు ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని మండిపడ్డారు.

తీవ్ర స్థాయిలో బాబుకు పిచ్చి ముదిరిందని అలానే ఉంటె టీడీపీ నాయకులకు కూడా పిచ్చి పడుతుందని తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు కురిపించారు. ఇక ఒకవైపు జగన్ ఇలా ఘాటు వ్యాఖ్యలు మాట్లాడుతున్న చంద్రబాబు మాత్రం నవ్వుతూ కనిపించాడు. మొత్తానికి జగన్ మాట్లాడిన వ్యాఖ్యలతో అసెంబ్లీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here