Nara Chandrababu Naidu : కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది చంద్రబాబే.! చిప్పు పూర్తిగా దొబ్బినట్టేనా.?
NQ Staff - December 22, 2022 / 04:59 PM IST

Nara Chandrababu Naidu : కరోనా వ్యాక్సిన్ తయారు చేసిందీ.. అలా తయారు చేయడానికి కృషి చేసిందీ తెలుగుదేశం పార్టీనే.. అంటే, నారా చంద్రబాబునాయుడుగారే.! ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సెలవిచ్చారు.!
తన గొయ్యి తానే ఎలా తవ్వుకోవాలో చంద్రబాబుకి బాగా తెలుసు. నిజానికి, హైటెక్ చంద్రబాబు అనే గుర్తింపు వుందాయనకి. హైద్రాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగం ఇంతలా వర్ధిల్లడానికి చంద్రబాబు చేసిన కృషి తక్కువేమీ కాదు. కానీ, ఆ ఘనత గురించి ఇంకెవరైనా చెప్పాలి.. ఆయనకాయన చెప్పుకుంటే అంతకన్నా భావదారిద్ర్యం ఇంకోటుండదు.
కోవిడ్ వ్యాక్సిన్‌పై టీడీపీకే పేటెంట్ హక్కులు..
మొన్నామధ్య ఏపీలో ఓ రాజకీయ సభలో మాట్లాడిన చంద్రబాబు, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉద్ధరించింది తానేననీ, తనకు అందరూ రాయల్టీ చెల్లించాలనీ హుకూం జారీ చేశారు. అప్పుడే అంతా ఆయన్ని చూసి నవ్వుకున్నారు. ఈసారి ఏకంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిందే తానని చెప్పుకుంటున్నారు.
కోవిడ్ వైరస్ వైసీపీ హయాంలో వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్లలో ఒకటైన కోవాగ్జిన్ భారతదేశానికి చెందనది.. అందునా, తెలుగు వ్యక్తులు నిర్వహిస్తున్న సంస్థ నుంచి వచ్చింది.
తమ సామాజిక వర్గానికి చెందినవారే ఆ వ్యాక్సిన్ తయారు చేశారని చంద్రబాబు అనుకుంటుండొచ్చుగాక.
అంతమాత్రాన అది టీడీపీ తయారు చేసిన, చేయించిన.. కాదు కాదు తానే తయారు చేసిన వ్యాక్సిన్ అని చెప్పుకుంటే ఎలా.? ‘ముసలాడికి చిప్పు దొబ్బిందా.?’ అని జనం తిట్టుకునే పరిస్థితిని చంద్రబాబు తనకు తానే తెచ్చుకుంటున్నారు.
కరోనా వాక్సిన్ కనిపెట్టిది నేనే అంటుండు ఏంది ర ఈ ముసలోడు చిప్ దొబిందా ఏంది……!!😂😂😂😂🤭🤭🤭🤭@PawanKalyan : @JanaSenaParty pic.twitter.com/gIR6nYWg7C
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) December 21, 2022