సవాల్ విసిరినా చంద్రబాబు.. ఇలాంటి సమయంలో ఏమిటండీ బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు .. ముఖ్యంగా కరోనా విషయంలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించాడు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ను ట్రీట్ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంత వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. కరోనా కేర్ టేకింగ్ గైడ్ లైన్స్ ఇచ్చారు. పేషంట్స్ ఏ విధంగా అడ్మిట్ చేయాలి, ఏలా డిశ్చార్జ్ చేయాలి అని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆక్సిజన్ ను ఏ విధంగా నిర్వహించాలి, కరోనా టెస్టులకు, డ్రగ్స్ కు సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నాను.

జీవోలలో ప్రభుత్వం చెప్పిన ఒకటైనా వాస్తవంగా అమలవుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నా. సంక్షోభంలోనైనా ప్రభుత్వానికి విశ్వనీయత ఉండాలి. ఇలాంటి క్లిష్టపరిస్థితులలోనైనా ఒక భాధ్యత తీసుకోవాలి. ఇలాంటి ఏ విధమైన భాధ్యత తీసుకోకుండా మాట్లాడుతున్న వారిని బెదిరిస్తూ వారిపై దాడి చేయడం పరమ దుర్మార్గం. ఇది మంచి పద్దతి కాదు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని అందరినీ కలుపుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఆ పని చేయకుండా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టడం నీచం. ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోని ఈ ప్రభుత్వం శ్మశానాలకు రాజులుగా ఉండాలనుకున్నారా? అంటూ నిప్పులు చెరిగాడు.

రాష్ట్రంలో మొత్తం 56 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో మొదటిసారి 45,48,000 ఇచ్చారు. ఇప్పటి వరకు 11 లక్షల మందికి మాత్రమే రెండో డోస్ ఇచ్చారు. మిగిలిన వారికి రెండవ వ్యాక్సిన్ ఇవ్వకపోతే వీరికి కూడా ప్రమాధకరంగా మారే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసిన నో-వ్యాక్సిన్ బోర్డులు పెట్టారు. మన రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. వీరందరికీ ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు?

రెమెడెసెవర్ వ్యాక్సిన్ ఆరు డోసులు వేసుకోవాలి. ఒక్కో డోస్ రూ. 25 వేల నుండి 35 వరకు ఉంది. ఇది సామాన్యులు భరించగలరా? ఇండియా జరుగుతున్న పరిణామాలపై సుందర్ పిచాయ్, నాదెళ్ల సత్య లాంటి వారు మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. వారి మాటలకు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణాలమాలే ఉదహరణలు. కనీసం వారికున్న భాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ లేకపోవడం భాదాకరమంటూ చంద్రబాబు మాట్లాడాడు.

Advertisement