Chandrababu Naidu : విశాఖ రగడ.! టీడీపీ గల్లంతయిపోయినట్లేనా.? ఇది ఎవరి ఘనత.?
NQ Staff - October 17, 2022 / 06:37 AM IST

Chandrababu Naidu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడారట. ఆ మాటకొస్తే, చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి మద్దతు కూడా ప్రకటించేశారు. జనసేనపై వైసీపీ ప్రభుత్వం దాష్టీనికి పాల్పడిందంటూ టీడీపీ నేతలు నినదిస్తున్న సంగతి తెలిసిందే.
అరెస్టు చేసిన జనసేన నేతల్ని వెంటనే విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసేశారు కూడా.! అయితే, ఈ మొత్తం వ్యవహారంలో విశాఖ వేదికగా టీడీపీ న్యూట్రల్ అయిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మూడు రాజధానుల వ్యవహారం.. టీడీపీని ముంచెయ్యడానికే..
టీడీపీని ముంచెయ్యడానికే వైసీపీ, మూడు రాజధానుల నినాదాన్ని భుజానికెత్తుకుంది. ఈ విషయంలో వైసీపీ కొంత సక్సెస్ అయ్యింది కూడా. విశాఖ వేదికగా వైసీపీ నిర్వహించిన గర్జన, ఆ తర్వాత జనసేన షో.. వెరసి.. తెలుగు రాజకీయాల్లో టీడీపీ అనూహ్యంగా పలచబడిపోయింది.
ఈ విషయంలో వైసీపీ ఓ రకంగా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ ఈసారి కొరివితో తల గోక్కున్నట్లయ్యింది. ‘మాకు మూడు రాజధానులు వద్దు.. ఒకే ఒక్క రాజధాని వుండాలి..’ అంటూ వేలాది, లక్షలాది మంది జనసైనికులు విశాఖ వేదికగా నినాదిస్తున్నారు. ఆ నినాదం వైసీపీ మూడు రాజధానుల ప్రచారానికి పెద్ద షాక్ అనే చెప్పాల్సి వుంటుంది.