ఒకే ఒక్క పథకంతో టీడీపీని దెబ్బకొట్టిన జగన్.. వారెవ్వా
PBN - October 30, 2020 / 08:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇంకా చిక్కుముడి వీడలేదు, స్టేట్ ఎన్నికల కమీషన్ ఎట్టి పరిస్థితిలో ఎన్నికల నిర్వహించాలని చూస్తూనే, ఏపీ సర్కార్ మాత్రం ఒప్పుకోవటం లేదు. గతంలో ఎన్నికలు కావాలని అడిగిన వైసీపీ సర్కార్ ఇప్పుడు వద్దు అంటుంది, గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ఏమో ఇప్పుడు ఎన్నికలు కావాలని అడుగుతున్నాడు.
ఇక ప్రధాన ప్రతిపక్షము తెలుగుదేశం మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ మేకపోతు గాంభీర్యం పైకి చూస్తున్న కానీ లోపల మాత్రం భయపడుతుంది. దానికి ఒకే కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పధకం. జనవరిలో అమ్మఒడి డబ్బులు జనాల ఖాతాల్లో పడాల్సి వుంది. ఈ అమ్మఒడికి ముందు ఎన్నికలు జరిగితే బెటర్ నా? తరువాత జరిగితే బెటర్ నా? అనేదే తెలుగుదేశం పార్టీ సమస్య. ఎందుకంటే అమ్మఒడికి ముందు ఎన్నికలు పెడితే, అది ఎదర వుంటుంది కాబట్టి, జనం ఎందుకయినా మంచిదని వైకాపాకే ఓట్లు వేస్తారేమో అనే ఆలోచన. లేదూ అమ్మఒడి తరువాత పెడితే, రెండో సారి వరుసగా డబ్బులు అందుకున్న ఆలోచనతో అటే ఓటు వేస్తారేమో అన్న అనుమానం మరో వైపు తెలుగుదేశం పార్టీ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 150 పైగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు , ఎమ్మెల్యే వైసీపీ కి చెందిన వ్యక్తి ఉన్న సమయంలో సర్పంచ్ గా టీడీపీ కి చెందిన వాళ్ళు ఉంటే , పనులు సరిగ్గా జరగవనే ఆలోచనతో కూడా ప్రజలు ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు, గతంలో ఎన్నికల నోటిఫికెషన్ ప్రకటించిన సమయంలో 2 వేలకు పైగా మండల పరిషత్ లు వైసీపీ కి ఏకగ్రీవం అయ్యాయి, 130 పైగా జడ్పీటీసీ లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి తిరుగులేని మెజారిటీ రావటం ఖాయం. ఇవన్నీ తెలిసిన కానీ వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు అంటే భయపడుతుడంటూ టీడీపీ ఆరోపణలు చేయటం హాస్యాస్పదం