ఈ ప్రకటన తో చంద్రబాబు రాజకీయాలకి గుడ్ బై ??

Mamatha 600 - December 23, 2020 / 03:30 PM IST

ఈ ప్రకటన తో చంద్రబాబు రాజకీయాలకి గుడ్ బై ??

ఒకొనొక సమయంలో టీడీపీ పార్టీకి తిరుగు లేదు. కానీ గత ఎన్నికల్లో అనుకోని విధంగా ఘోర పరాజయం పాలయింది. మా పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ పార్టీని వైఎస్సాఆర్ పార్టీ ఘోరంగా ఓడించింది. క్యాలెండర్లో నెలలు మారుతున్నా కానీ ప్రతిపక్ష పార్టీకి రావాల్సిన పేరు రావడం లేదు. రానురాను ఏపీ విపక్షం అంతకంతకూ నీరసించిపోతోంది. అందుకని చంద్రబాబు నాయుడు కొత్త ప్రయోగానికి తెర తీశారు. అదేంటంటే ఏపీలోని 25 ఎంపీస్థానాల్ని, ఐదు స్థానాలకు ఒకరు చొప్పున ఒక నేతకు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించారు. అంటే మన ఏపీలోని పాతిక ఎంపీ స్థానాల్ని ఐదు జోన్లకుగా విభజించారు. ఆ ప్రాంతాన్ని తాజాగా నియమించిన నేత పర్యవేక్షణలో ఉండాలని, టీడీపీ పార్టీ పురోగతికి పాటుపడాలన్నది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు.ఏ ఏ నియోజకవర్గాల బాధ్యతని ఏ నాయకుడికి అప్పగించగారో చూద్దాం.. !!

Chandrababu_Naidu_

అంటే శ్రీకాకుళం, విజయనగరం,అరకు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ఐదు స్థానాలు జోన్ 1లో ఉండనున్నాయి. దీని బాద్యత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు అప్పగించారు. జోన్ 2లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు స్థానాలు ఉండనున్నాయి. వీటిని పంచుమర్తి అనుధాకు అప్పజెప్పారు. ఇంకా జోన్ 3లో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల స్థానాలు ఉన్నాయి.

దీని బాధ్యతను ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడికి కు అప్పెజెప్పారు. జోన్ 4లో ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల బాధ్యతను అనగాని సత్యప్రసాద్ ఇచ్చారు. జోన్ 5లో కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి బాధ్యతను మాజీ మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డికి కేటాయించారు. మరీ చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.. ఇది పార్టీ కి ప్లస్ అవుతుందో అనేది వేచి చూడాలి.. !!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us