Chandra babu: ఫ్యామిలీపై విమ‌ర్శ‌లు … చిన్న‌పిల్లాడిలా ఏడ్చిన చంద్ర‌బాబు

Chandra babu: గ‌త కొంత కాలంగా ఏపీలో రాజ‌కీయాలు చాలా హాట్ హాట్‌గా న‌డుస్తున్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో చంద్రబాబు టీడీపీని గెలిపించుకోవడంలో విఫలం కావడంతో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఆడుకుంటోంది. ఇవాళ చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టగానే వైసీపీ సభ్యులు,మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

chandra-babu-sensitive-reaction1
chandra-babu-sensitive-reaction1

ఆయన అవ‌మానంతో అసెంబ్లీ నుండి వాకౌట్ చేస్తూ బ‌య‌ట‌కు వెళ్లారు. సీఎం అయ్యాకే తిరిగి అడుగుపెడతానన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అక్కడా కన్నీరుమున్నీరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదనీ, కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. న‌ల‌బై ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న చంద్ర‌బాబుని ఓ దశలో మంత్రి కొడాలి నాని లుచ్చా అంటూ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాదు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు.

దీంతో చంద్రబాబుకు తీవ్ర అవమానం తప్పలేదు. దీంతో చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ప్రెస్ మీట్‌లో అసెంబ్లీలో వైసీపీ తీరు చాలా దారుణంగా ఉందని చంద్రబాబు తెలిపారు. తాను ఎంతో సంయమనంగా ఉన్నా సీఎం జగన్ తనను పదే పదే రెచ్చగొట్టారని చంద్రబాబు తెలిపారు.

chandra-babu-sensitive-reaction
chandra-babu-sensitive-reaction

అయినా తాను వ్యక్తిగత విమర్శల్ని కూడా పట్టించుకోలేదన్నారు. అయినా ఇవాళ తన భార్య పేరును ప్రస్తావిస్తూ అవమానించారని, దీంతో తాను తట్టుకోలేకపోయానన్నారు. ఆ విషయం చెప్తూ ప్రెస్ మీట్లోనే చంద్రబాబు ఏడ్చేశారు. చంద్ర‌బాబు ఇలా కన్నీరు పెట్ట‌డం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.