వై ఎస్ జగన్ మీద CBI కేసులు – సంచలన సీక్రెట్ లీక్ చేసిన ఉండవల్లి !

గతంలో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలుడు అనే ముద్ర పడిన ఉండవల్లి అరుణకుమార్ ఈ మధ్య కాలంలో వరస ప్రెస్ మీట్స్ పెట్టి జగన్ కు సలహాలు ఇస్తున్నాను అంటూ చెపుతున్న మాటలు కావచ్చు, మాట మాటకి కేసులు అంటే భయపడుతున్నావా అంటూ గుర్తుచేయటం వలన జగన్ కు వ్యతిరేకి అనే ముద్ర వేయించుకుంటున్నాడు.

undavalli arunkumar

అలాంటి ఉండవల్లి తాజాగా మరోసారి మీడియా ముందుకి వచ్చి జగన్ పరిపాలన, పోలవరంపై మాట్లాడుతూ చంద్రబాబు హాయాంలో జరిగిన విధంగానే మళ్ళీ పోలవరం పనులు యధావిధిగా జరుగుతున్నాయి, అయితే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోలవరం పర్యటన ను అడ్డుకోవటం చాలా తప్పు అని ఇలా చేయటం వలన పోలవరం విషయంలో అనేక అనుమానులు వస్తున్నాయని, ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ అన్నాడు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ కు పోలవరం ప్రాజెక్టు అప్పగించటం పై స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిదులు కేంద్రమే ఇవ్వాలన్నదె పార్లమెంట్ లో చేసిన చట్టం అని ఆయన వెల్లడించారు. కేసులు గురించి చంద్రబాబు, జగన్ లు ఒకరి పై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయం లో వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి ఏంటో జగన్ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

2014 నాటి రేట్లు కు 2020లో పనులు చేస్తారా ? ఇదేనా ధర్మం అని ప్రశ్నించారు. మోదీ చేసేది ప్రజల తో వాస్తవాలు చెప్పండి అని ఆయన డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా ? నిజాలు చెప్పండి అన్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానికి కి రాసిన లేఖ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి అడిగే దమ్ము లేదు. ముఖ్యమంత్రి జగన్ అయినా నీతి ఆయోగ్ లేఖ తీసుకురావాలి కదా ? ఆలా చేయటం లేదంటే ప్రజలు అనుకుంటున్నట్లు గా సీబీఐ కేసులు కు భయపడుతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఉండవల్లి ఓ గొప్ప సలహా ఇచ్చారు. అదేమిటంటే.. నవరత్నాల హామీలను అమలు నిలిపివేయడం. నవరత్నాలను చూసి.. జగన్‌కు ఓట్లేయలేదట. కేవలం.. పోలవరం, ప్రత్యేకహోదా అంశాలను చూసే ఓట్లేశారని..అందుకే సంక్షేమం పేరుతో సంక్షోభం తెచ్చుకోవద్దని సలహాలిస్తున్నారు. అసలు ఉపాధే లేనప్పుడు.. సంక్షేమం ఎందుకని ఉండవల్లి ప్రశ్నించాడు

Advertisement