తెలంగాణాలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. గందరగోళంగా మారిన రాజకీయం.
Admin - November 2, 2020 / 01:53 PM IST

తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే నిన్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మొన్న సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిరసనగా బీజేపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇక ఈ ఘటనలో ఆ యువకుడు యాభై శాతం కాలినట్లు తెలుస్తుంది. అయితే సమాచారం తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాక ప్రచారం నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఆ బాధితుడైన యువకున్ని పరామర్శించి అతడికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు సంజయ్.
ఇక ఇది ఇలా ఉంటె ఈ ఘటనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా అల్లర్లు సృష్టించేందుకే ఇలాంటి ఘటనలకు బీజేపీ ఒడిగట్టిందని మండిపడ్డాడు. ఇక దీనిపై మాకు పక్క సమాచారం ఉందని ఆయన అన్నాడు. అయితే ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేయాలనీ బీజేపీ భావిస్తుందని పేర్కొన్నాడు. అయితే పోలీసులు కాల్పులు చేపట్టేలా ఆందోళనలు నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలకు చెప్పారని కేటీఆర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ విషయంపై టీఆర్ఎస్ నేతల బృందం డిజిపికి పిర్యాదు కూడా చేశామని తెలిపాడు. ఒకవైపు కేటీఆర్ మాటలకు బీజేపీ కూడా విమర్శలు కురిపించింది. అయితే బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మాహుతి ఘటనకు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలనీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై కాల్పులు చేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ బెదిరింపులకు ఎవ్వరు భయపడరని ఎంపీ అరవింద్, లక్ష్మణ్ మండిపడ్డారు. ఇక మొత్తానికి ఈ ఘటనతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయం రగులుతుంది.