టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

Admin - January 5, 2021 / 02:22 PM IST

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

తెలంగాణాలో బీజేపీ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుండి రాష్ట్రంలో కాషాయ గాలి విస్తోంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. ఆ తరువాత గ్రేటర్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులకు నమ్మకం కుదిరింది. ఇక అదే ఊపును ఏమాత్రం తగ్గించకుండా పార్టీని ముందుకు లాగుతున్నాడు బండి సంజయ్. ఇక ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా కమల గూటికి చేరుతున్నారు. దీనితో పార్టీకి మరింత బలం చేకూరుతుండడంతో స్పీడ్ ను పెంచుతున్నారు.

అదే దూకుడు సాగర్ లో పనిచేస్తోందా..

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

వరుస గెలుపులతో దూకుడు మీద ఉన్న కాషాయ పార్టీకి మరోసారి తమ సత్తాను చాటే అవకాశం ఏర్పడింది. అయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నికకు దారి తీసింది. దీనితో ఈ ఉపఎన్నికలో కూడా దూకుడు ప్రదర్శించి గెలువాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. వాస్తవానికి సాగర్ లో బీజేపీకి అంత పెద్ద క్యాడర్ లేదు. అయితే గత ఎన్నికల్లో మూడు వేల ఓట్లు కూడా సంపాదించలేదంటే.. పరిస్థితి ఎలా ఉందొ మీకే అర్థమై ఉంటుంది. కానీ ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే సాగర్ లో కలిసొచ్చే అవకాశలు మెరుగ్గానే కనిపిస్తోన్నాయి.

ఇప్పటినుండే ప్రణాళికలు

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

సాగర్ పై ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళికలు రచిస్తోంది. అయితే సాగర్ బరిలో ఎవరిని నిలపాలనే అంశంపై ఇప్పటికే ఓ ఇంచార్జ్ ను కూడా నియమించింది. అలాగే ఇద్దరు నేతలు ప్రచారం కూడా నిర్వస్తున్నారు. అయితే ఈ సీటు కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి, అలాగే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తులో భాగంగా పోటీ చేసిన కడారి అంజయ్య యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాదు తాజాగా ఈ ఇద్దరితో బీజేపీ పెద్దలు మంతనాలు కూడా జరిపారు. ఇక సాగర్ లో బూత్ సభ్యులను పటిష్టం చేసుకోవడానికి కో ఆర్డినేటర్లను కూడా నియమించింది. అలాగే సాగర్ నుండి పలువురు కార్యకర్తలు బీజేపీలో కూడా చేరారు. దీనితో సాగర్ లో గెలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

జానా వైపే చూపు

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

ప్రస్తుతం సాగర్ లో బలమైన నేత జానారెడ్డి. ఈయనను కమల గూటికి లాగాలని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఒకవైపు జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ ఆయన దగ్గర నుండి మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. అంతేకాదు బీజేపీలో చేరితే ఒక కీలక పదవి ఇస్తామని ఆఫర్ చేసిన జానారెడ్డి మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ జానారెడ్డి కమల గూటికి చేరితే బీజేపీ ఖాతాలో మరో విజయం నమోదు కావడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us