BJP : మునుగోడులో టీఆర్ఎస్‌కి ఝలక్.! బీజేపీలోకి పెరుగుతున్న చేరికలు.!
NQ Staff - September 21, 2022 / 10:14 AM IST

BJP : ఉప ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోంచి అధికార పార్టీలోకి చేరికలు ఎక్కువగా వుంటుంటాయ్. కానీ, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకుంటాననే ధీమా మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

BJP Shock to TRS Before Munugodu Elections
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.. ఆయన బీజేపీలో చేరారు. గులాబీ పార్టీలో గందరగోళం.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మునుగోడులో కిందా మీదా పడుతోంది పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో. సరిగ్గా, ఈ గందరగోళాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది.
తాజాగా టీఆర్ఎస్కి చెందిన చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడతలపల్లి సర్పంచి గంట తులశయ్య తదితరులు బీజేపీలో చేరారు. వారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినా, కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గతంగా కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ కూడా వెనుకంజలోనే వున్నట్లు కనిపిస్తోంది.