YS Jagan Mohan Reddy : జగన్నాథ రథ చక్రాలేంటి.? ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏంటి.?

NQ Staff - November 12, 2022 / 03:37 PM IST

YS Jagan Mohan Reddy  : జగన్నాథ రథ చక్రాలేంటి.? ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏంటి.?

YS Jagan Mohan Reddy  : వస్తున్నాయ్ జగన్నాథ రధ చక్రాల్.. అంటాడు శ్రీశ్రీ.! ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. అంటాడు వంగపండు ప్రసాదరావు.! ఒకరేమో ప్రజా కవి.. ఇంకొకరేమో ప్రజా గాయకుడు.! ఈ ఇద్దరి ప్రస్తావన.. కాదు కాదు వారి పాటల ప్రస్తావన వచ్చింది విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బహిరంగ సభలో.. అందునా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వీటి ప్రస్తావన రావడమే ఆశ్చర్యకరం.

జన ప్రవాహం తరలి వచ్చిందని చెప్పడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జగన్నాథ రధ చక్రాల్.. ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇదేం ప్రస్తావన చెప్మా.?

అయితే, ఈ ప్రస్తావన వైఎస్ జగన్ అనవసరంగా చేశారన్న చర్చ ఉత్తరాంధ్ర లో నడుస్తోంది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా..’ పాట ప్రాముఖ్యత వేరు. దాన్ని ఓ రాజకీయ సభకు ఆపాదించడం ఎంతవరకు సబబు.? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే క్రమంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీచ్‌ని సమయం, సందర్భం లేకుండా రాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బీజేపీ శ్రేణులు మాత్రం, ప్రధాని మోడీని వైఎస్ జగన్ కీర్తించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సభతో బీజేపీ – వైసీపీ మధ్య కొత్త మైత్రి షురూ అయ్యిందన్న వాదనలూ లేకపోలేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us