Roja: సొంత పార్టీలోనే రోజాకు భారీ షాక్..?.. ఆయనే కారణమా ..?

Roja వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రోజుకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు, కానీ కుల సమీకరణాలు సరిగ్గా కుదరలేదంటూ ఆమెను పక్కన పెట్టారు. అయితే రెండో ధపా లో అయిన తనకు మంత్రి పదవి రాబోతోందా అని ఎదురుచూస్తున్నా రోజాకు ఈ సారికూడా మొండిచెయ్యి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

MLA Roja's voice message proves the rift between the leaders of Chittoor district

జగన్ సర్కార్ కు రెండున్నరేళ్లు గడుస్తున్నా సమయంలో తన మంత్రి వర్గంలో దాదాపు 20 నుండి 30 శాతం మంత్రులను తొలగించి, కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా గౌడా సామాజికవర్గానికి చెందిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడను తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత మంత్రి వర్గంలో గౌడా సామాజిక నేతలు ఎవరు లేకపోవటంతో ఈసారి ఆ వర్గానికి అవకాశం ఇవ్వాలని సీఎం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే రోజాకు మంత్రి పదవి రానట్లే భావించాలి.. ఎందుకంటే ఇప్పటికే ఆ జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన్ను తొలిగించే అవకాశమే లేదు.. ఆయనకి తోడుగా వెంకట గౌడాను తీసుకుంటే అప్పుడు ఒకే జిల్లా నుండి ఇద్దరు మంత్రులు అవుతారు.. ఇలాంటి సమయంలో మూడో మంత్రిగా రోజాకు అవకాశం లేనట్లే లెక్క..

అయితే రోజాకు మంత్రి పదవి రాకుండా చేయటం కోసమే పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడాను రంగంలోకి దించినట్లు ఎమ్మెల్యే రోజా సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డికి రోజాకు మొదటి నుండి కొన్ని బేదాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. పైగా వెంకట గౌడా పెద్దిరెడ్డి వర్గానికి చెందిన మనిషి అనే మాటలు వినిపిస్తున్నాయి.. ఈ కోణంలో చూసుకుంటే రోజాకు చెక్ పెట్టటం కోసమే వెంకట గౌడాను మంత్రి పదవికి రామచంద్ర రెడ్డి స్వయంగా సిపార్సు చేసినట్లు చిత్తూరు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Advertisement