బిగ్ షాక్ : ఏపీ క్యాబినెట్ నుంచి నలుగురు మంత్రులు ఔట్ ??

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధికార పక్షం లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అందుకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తుంది. భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రజా పాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నాడు, ఇదే క్రమంలో తనతో కలిసి పనిచేస్తున్న మంత్రి వర్గాన్ని కూడా అదే విధంగా పనిచేపిస్తూ, అవినీతికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు, అయినా కానీ కొందరు మంత్రుల పనితీరు పట్ల సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో వాళ్ళను మంత్రి వర్గం నుండి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ap cm jagan

రాష్ట్రంలో సీఎం జగన్ ఎక్కవుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, అందుకు నిధులు కూడా ఎక్కవుగా అవసరం అవుతున్నాయి,కానీ కొందరు మంత్రులు తమ తమ శాఖల పట్ల సరైన అవగాహనా లేకపోవటం,ఆదాయం వచ్చే మార్గాలను గుర్తించకపోవటం వలన ప్రభుత్వానికి తగినంత ఆర్థిక వనరులు చేకూరటం లేదనే ఆలోచనే జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అదే కారణాన్ని చూపిస్తూ దాదాపు నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తుంది.

అదే సమయంలో ఒక మంత్రిపై గత కొద్దీ రోజులుగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావటంతో ఆ మంత్రిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కొంత మంది మంత్రులు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కొంత వరకు సహకరిస్తున్నారు అనే భావన ఉంది. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీతో వైసీపీ మంత్రి ఎక్కువగా సావాసం చేస్తున్నారట. న్యాయసహాయం కోసం సదరు ఎంపీ తో ఆయన స్నేహం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆ మంత్రిపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఉండబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారం నాటికీ తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement