బిగ్ బ్రేకింగ్ : ఈటెలతో రేవంత్ రెడ్డి భేటీ..?

ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈటెల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి వెన్నంటి నడిచిన ఈటెల విషయంలో ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. కానీ రాజకీయాలు అనేవి ఎప్పుడు ఇలాగె ఉంటాయి. పొరపెచ్చులు రానంత వరకే ఏ బంధమైన నిలబడుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అలాంటి పొరపెచ్చులు వస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.

etela rajendar and revanth reddy

ఇక దాదాపుగా ఈటెల రాజేందర్ కారు దిగే ఆలోచనలో ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది. మరి ఆయన గులాబీకి బై బై చెప్పేసి, ఏ పార్టీలో చేరుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లు కూడా ఈటెలను తమ వైపు తిప్పుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈటెల రాజేందర్ కనుక బీజేపీలోకి వస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వటానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈటెలను తమ దారికి తెచ్చుకుంటే కేసీఆర్ కు గట్టి ఝలక్ ఇవ్వచ్చని తెలుస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈటెలతో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తెరాస పార్టీ పెట్టిన నాటి అందులోనే నలిగిన నేత కాబట్టి ఈటెలకు ఆ పార్టీ యొక్క లొసుగులు బాగానే తెలిసుంటాయి. కాబట్టి అలాంటి కీలక నేత ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీకి వచ్చే ఎన్నికలో కొంచం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అందుకే ఈటెల కోసం అటు బీజేపీ కి చెందిన ధర్మపురి అరవింద్,. ఇటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాను పార్టీని వీడే విషయంపై ఇక క్లారిటీ ఇవ్వలేదు ఈటెల.. ఒక వేళ పార్టీ మారితే ఏ పార్టీ కండువా కప్పుకుంటాడు. ఎలాగూ తెరాస పార్టీని నిర్మించటంలో అనుభవం ఉందని భావించి దానిలాగే మరో కొత్త పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్తాడా..? లేక తమ పాతికేళ్ల స్నేహ బంధం గుర్తుచేసుకొని మరోసారి కేసీఆర్ తో రాజీపడి కారులోనే కూర్చుండిపోతాడా అనేది చూడాలి…

Advertisement