” చావు – చంపు ” బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు – వైరల్ వీడియో !

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పీడ్ ప్రస్తుతం మాములుగా లేదు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యిపోయాడు. ప్రతి రోజు ఎదో ఒక హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఎన్నికల వేడిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలనీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరాడు, మరో రోజు తాము అధికారంలోకి వస్తే పాతబస్తీ లో సర్జికల్ స్ట్రెక్స్ చేస్తానని అన్నాడు, తర్వాతి రోజు పీవీ , ఎన్టీఆర్ సమాధుల విషయంలో ఎంఐఎం పార్టీకి సవాల్ విసిరి, తర్వాతి రోజు ఆయా సమాధుల దగ్గరకు వెళ్లి ప్రమాణం చేసి వచ్చాడు, ఈ విధంగా రోజు మీడియాలో హైలైట్ అవుతున్న బండి సంజయ్.

Bandi Sanjay

తాజాగా మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు , జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్‌మెట్‌లో నిర్వహించిన రోడ్‌షోలో సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో బీజేపీ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యమని.. సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

“ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు భయపడేది” లేదన్నారు. ట్యాంక్‌బండ్‌ విగ్రహాలను టచ్‌ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి హెచ్చరిస్తున్నట్టు బండి సంజయ్ వ్యాఖ్యానించాడు.
ఇక టి‌ఆర్‌ఎస్ అక్రమ పాలన కూలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు.

ఇలా రోజుకో వివాదాస్ప‌ద‌, సంచల‌నాత్మ‌క విమ‌ర్శ‌లు, ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం బండి సంజ‌య్‌కి పెద్ద ఎత్తున ప్ర‌చారం తెచ్చి పెడుతోంది. అయితే ఇలాంటివి విన‌డానికి ,మీడియాలో హైలెట్ కావ‌డానికి బాగా ఉప‌క‌రిస్తాయి. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో బండి సంజ‌య్ సంచ‌ల‌నాలు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కేనా? లేక ఫ‌లితాల్లో కూడా చూపుతారా? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

Advertisement