ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Admin - January 8, 2021 / 05:06 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో సంజయ్ పర్యటించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువ రోజులు పాలించే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇంకా రెండు ఏళ్లలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పేరు వింటేనే రాష్ట్రంలో మంత్రులందరికీ భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
బీజేపీ గురించి మాట్లాడుతున్న మంత్రి అజయ్ తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు. నాలుగు సంవత్సరాల్లో నాలుగు పార్టీలు మారి ఇప్పుడు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావా అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి కాపాడుకోవడానికి విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పుకొచ్చారు. అజయ్ అక్రమ భూములను రెగ్యులరేషన్ చేసుకోవడానికే టీఆర్ఎస్ లో చేరాడని అన్నారు. ముఖ్యంగా మెడికల్ కళాశాల పేరుతో విద్యార్థులను మోసం చూస్తున్నాడని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రి అక్రమాలన్ని బయటపెడతామని చెప్పుకొచ్చారు. ఖమ్మం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఫలితాలే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో అదే రీతిలో వెలువడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో రాజకీయాలు రగులుతున్నాయి. దీనితో నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ సంచనలంగా నిలుస్తున్నారు.